BigTV English

Funeral : వామ్మో.. చనిపోయిన తర్వాత మనిషిని ఇలా కూడా చేస్తారా..!

Funeral : వామ్మో.. చనిపోయిన తర్వాత మనిషిని ఇలా కూడా చేస్తారా..!

Funeral : మన దేశంలోని సాంప్రదాయాల ప్రకారం.. మనిషి చనిపోతే మాత్రం కచ్చితంగా అంత్యక్రియలు నిర్వహిస్తాం. ఆత్మీయులు చనిపోయారనే మోయలేని బాధను తట్టుకుని వారిని తిరిగారాని లోకాలకు ఆచార సాంప్రదాయలతో పంపిస్తాం. అయితే.. ఈ అంత్యక్రియల తంతు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. మనకు తెలిసిందైతే.. ఖననం చేయడం లేదా దహనం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ కొంతమంది చనిపోయిన వారిని కాకులకు, గద్దలకు వేస్తారట. ఇంకా చాలా చేస్తారట.. అవేంటంటే..!


పక్షులకు ఆహారంగా వేయడం : పర్సియన్ దేశస్థులు చనిపోయిన శవాలను పక్షులకు, రాబందులకు ఆహారంగా వేస్తారు. ఆ శవం వృధా కాకుండా పక్షుల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుందని ఈ విధంగా చేస్తారు. ప్రస్తుతం ఈ పధ్ధతి అక్కడ చాలావరకు తగ్గిందనే చెప్పాలి. రాబందులు కూడా చాలా వరకూ తగ్గిపోయాయి.శవాలను సోలార్ ప్లేట్లుపై ఉంచి దహనం చేస్తున్నారు.

శవాలను తినడం : ఇది వినడానికి చాలా వింతగా ఉన్నా.. న్యూగినియా, బ్రెజిల్ దేశాలలో ఈ పద్ధతిని పాటిస్తారు. చనిపోయిన వారి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని భుజిస్తారు. ప్రస్తుతం ఈ పధ్ధతి అక్కడ చాలా అరుదనే చెప్పాలి.


నదిలో/ సముద్రంలో వేయడం : మనం సమాధి కట్టినట్లు లేదా దహనం చేసినట్లుగా.. దక్షిణ అమెరికాలోని ఓ ప్రాంత ప్రజలు చనిపోయిన మృతదేహాలను సమృద్ధిగా పారుతున్న నదులలో లేదా సముద్రాలలో ఆ శవాలను పడేసి అంత్యక్రియలు జరుపుతారు.

గుహల్లో ఉంచడం : ఇరాక్, ఇజ్రాయిల్ దేశాలలో ఎవరైనా చినపోతే.. శవాలను ఊరికి చివరన గుహలలో వదిలివేస్తారు. ఆ శవాలను అలా ఉంచడానికి పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగిస్తారట.

గొంతు నులిపివేయడం : మనదేశంలో ఒకప్పుడు భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోవాలని ఆమెను మంటల్లోకి తోసేవారు. దీన్నే సతీసహగమనం అంటారు. ఇలాంటి పద్ధతినే దక్షిణ పసిఫిక్‌లోని ఫిజి ప్రాంతంలో పాటిస్తున్నారు. ఎవరైనా తమ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే.. ఆ శవం ఒంటరిగా వెళ్లకూడదని ఆ కుటుంబంలోని ఎవరైనా సరే ఒకరు వారితో పాటు చనిపోవాలట. వారి కుటుంబంలోని మరో వ్యక్తిని ఇలా కూర్చోబెట్టి గొంతుకు తాడు లేదా ఏదైనా బట్టను ఉపయోగించి గొంతును నుమిలివేస్తారు. అలా గొంతునులిపి వేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం.

కొండ అంచున ఉరితీయడం : ఈ సంప్రదాయం చైనాలో ఉంది. చనిపోయిన వారి శవాలను వీరు కొండ రాళ్ల మధ్య లేదా కొండల అంచున పెట్టెల్లో పెట్టి ఉరి తీస్తారు.ఇలా చేస్తే స్వర్గానికి చేరుకుంటారని వారి నమ్మకం.

మమ్మీలు : మమ్మీలు అనగానే మనందరికి గుర్తొచ్చేది ఈజిప్టు. అక్కడ ఎవరైనా చనిపోతే వారిని గుడ్డలతో చుట్టి పెట్టెల్లో దాస్తారు. ఇలా చేయడం వలన చనిపోయిన వారు ఎప్పటికైనా తిరిగి వస్తారని వారి విశ్వాసం. చైనా, టిబెట్, థాయిలాండ్, శ్రీలంక, భారత్‌‌లోని కొన్ని ప్రదేశాల్లో కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

కాల్చివేయడం : హిందువుల ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేయాలనే దాన్ని అయిదు అంశాలను పరిగణలోకి తీసుకొని పూర్తిచేస్తారు. అందులో ఇలా కట్టెలపై కాల్చివేయడం ఒకటి. కొన్ని శతాబ్దాల నుండి ఈ ఆచారం అమలులో ఉంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×