BigTV English

Global Warming : అగ్నిపర్వతాలతో గ్లోబల్ వార్మింగ్‌కు పరిష్కారం

Global Warming : అగ్నిపర్వతాలతో గ్లోబల్ వార్మింగ్‌కు పరిష్కారం

Global Warming : గ్లోబల్ వార్మింగ్‌పై పరిశోధనలు చేసే విషయంలో ఇప్పటికే శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. గ్లోబల్ వార్మింగ్ అదుపులోకి వస్తుందని వారు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అలా అని ప్రయత్నం కూడా ఆపకుండా పరిశోధనలు చేపడుతున్నారు. తాజాగా వారు మరో కొత్త కోణంలో పరిశోధనలు చేయడానికి ఆర్థిక సాయం లభించింది.


అగ్నిపర్వతం బద్దలయినప్పుడు దాని నుండి వచ్చే లావా దేనినైనా కాల్చేసింది. భూమి రూపురేఖలనే మార్చేస్తుంది. కానీ ఆ అగ్నిపర్వతం వల్లే గ్లోబల్ వార్మింగ్‌ను కంట్రోల్ చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా దీనివల్ల సూర్యకాంతి ప్రకాశం తగ్గించవచ్చని.. దీనివల్లే గ్లోబల్ వార్మింగ్ సాధ్యమని వారు అంటున్నారు. ప్రస్తుతం భూగ్రహం చాలా వేడిగా మారింది. అలాంటిదాన్ని తాత్కాలికంగా చల్లబరచడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇప్పటికే సోలార్ బయోఇంజనీరింగ్‌లో చేసిన పరిశోధనల్లో సల్ఫర్‌ను స్ట్రాటోస్పియర్‌లోకి వదలడం ద్వారా అనుకూల ఫలితాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే సోలార్ బయోఇంజనీరింగ్ విభాగంలో మరిన్ని పరిశోధనలు చేయడానికి నైజీరియా, చైల్, ఇండియాతో మరో 15 దేశాల పరిశోధకులు ఎంపికయ్యారు. దీనికోసం యూకేకు చెందిన ఒక ఎన్జీవో 9,00,000 డాలర్లను వారికి ఆర్థిక సాయంగా అందించింది. సోలార్ రేడియేషన్ మాడిఫికేషన్ (ఎస్సార్ఎమ్)ను స్టడీ చేయడానికి ముందుగా ఈ డబ్బును ఖర్చుచేయనున్నారు పరిశోధకులు.


ఎస్సార్ఎమ్ అనేది వాతావరణ మార్పుల దగ్గర నుండి వడగాలులు, బయోడైవర్సిటీ వరకు అన్నింటిని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. 2018లో మొదటిసారిగా ఈ ఎన్జీవో 9,00,000 డాలర్ల ఆర్థిక సాయాన్ని శాస్త్రవేత్తలకు అందజేసింది. ఇది ఎస్సార్ఎమ్ ద్వారా సౌత్ ఆఫ్రికాలోని కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను, ఫిలిప్పిన్స్‌లోని ధాన్యం పంటపై పడే ప్రభావాన్ని స్టడీ చేయడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడింది. ఇప్పుడు మరో 9 లక్షల డాలర్ల ఫండ్ ద్వారా ఎస్సార్ఎమ్‌పై క్షుణ్ణంగా మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×