BigTV English

IT stocks : ఐటీ స్టాక్స్ కొనడానికి మంచి సమయం.. ఇప్పుడు కొంటే భవిష్యత్తులో బోలెడు లాభం

IT stocks : ఐటీ స్టాక్స్ కొనడానికి మంచి సమయం.. ఇప్పుడు కొంటే భవిష్యత్తులో బోలెడు లాభం
IT stocks

IT stocks : గుడ్ న్యూస్. ఇండియన్ ఐటీ స్టాక్స్ పడిపోతున్నాయి. ఈ పతనం మరో మూడు, నాలుగు నెలల వరకు ఉంటుందని అంచనా. ఐటీ స్టాక్స్ పడిపోతుంటే.. గుడ్ న్యూస్ ఏంటనా. ఇన్ఫోసిస్ షేర్ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది.  ఇంకాస్త పడిపోవచ్చు కూడా. టాప్ ఐటీ కంపెనీ షేర్ల పరిస్థితి కూడా అంతే. టీసీఎస్, విప్రో షేర్లు పడిపోతున్నాయి. సో, ఈ స్టాక్స్ పడిపోతున్నప్పుడు వాల్యూ బైయింగ్ చేయాలని మార్కెట్ అనలిస్టులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లు కచ్చితంగా తమ పోర్ట్ ఫోలియోలో ఐటీ స్టాక్స్ కూడా పెట్టుకోవాలి. సో, అలాంటి వారికి ఇది రైట్ టైం అంటున్నారు. కనీసం మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు కాబట్టి.. ఇప్పుడు కొనుక్కుంటూ యావరేజ్ చేసుకుంటూ వెళ్తే.. వన్ ఇయర్ తరువాత బంపర్ రిటర్న్స్ ఖాయం అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.


ఐటీ కంపెనీలకు ఏంటీ పరిస్థితి:
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముసురుకుంటోంది. యూరప్‌ దేశాలు ఆల్రడీ రెసిషన్‌లో ఉన్నట్టే. అమెరికాలో సిలికాన్ బ్యాంక్ పతనం.. మిగతా బ్యాంకుల పరిస్థితిని చెప్పకనే చెప్పింది. సో, బ్యాంకింగ్ క్రైసిస్ బాంబ్ ఎప్పుడు పేలుతుందో చెప్పలేం. దీంతో యూరప్‌తో సహా అమెరికా ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా ఐటీ మీద పెట్టే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఇండియన్ ఐటీ కంపెనీలకు ఈ మార్కెట్లే కీలకం. ఇప్పుడు అమెరికా, యూరప్ ఐటీ ఖర్చులు తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా ఆ ఎఫెక్ట్ మన ఐటీ కంపెనీలకే.

ఈ పరిస్థితి మరో కొన్ని నెలల వరకు తప్పదు. అప్పటి వరకు ఇండియన్ ఐటీ కంపెనీలకు కాంట్రాక్టులు, లాభాలు తక్కువగానే ఉంటాయి. సో, ఇలాంటి టైంలోనే ఇన్వెస్ట్ మెంట్‌కు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×