BigTV English

Google:- ఫేక్ న్యూస్‌పై గూగుల్ సీరియస్ యాక్షన్..

Google:- ఫేక్ న్యూస్‌పై గూగుల్ సీరియస్ యాక్షన్..

Google:- ఈరోజుల్లో ఏది నిజం, ఏది అబద్ధం అనేది అర్థం కావడం లేదు. ముఖ్యంగా మన దగ్గరకు వచ్చిన సమాచారం నిజమా, కాదా అని తెలుసుకునే అవకాశం కూడా ఉండడం లేదు. ఈ మధ్యకాలంలో ఫేక్ న్యూస్‌లే సెన్సేషన్ అవుతున్నాయి. దీనికి పలు మీడియా సంస్థలు, సోషల్ మీడియా యాప్స్ కూడా అండగా నిలుస్తున్నాయి. అందుకే ప్రజలు కూడా అయోమయంలో పడుతున్నారు. ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టడానికే గూగుల్ తమవంతు సాయం చేస్తానంటూ ముందుకొచ్చింది.


ప్రస్తుతం ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా ముందుగా మనకు గుర్తొచ్చేది మన దగ్గర ఉండే స్మార్ట్ ఫోన్, అందులో ఉండే గూగుల్. ఏ సమాచారం కావాలన్నా ఈరోజుల్లో మనకు గూగుల్ నుండే అందుతుంది. అలాంటి గూగుల్ ద్వారా ఫేక్ న్యూస్ కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా 2023లో వ్యాప్తి చెందిన ఫేక్ న్యూస్ శాతం భారీగా ఉందని ఇటీవల సర్వేలో తేలింది. ఒకరకంగా ఫేక్ న్యూస్ అందరికీ చేరడానికి గూగుల్ కూడా కారణం కావడంతో దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది.

ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి గూగుల్ ఒక కొత్త ఫీచర్‌ను తయారు చేయనుంది. ఇప్పటికే గూగుల్‌లో ఎబౌట్ ధిస్ రిజల్ట్ అనే ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్ తొమ్మిది భాషల్లో యూజర్లకు అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా కొత్తగా గూగుల్ సెర్చ్ బార్ పక్కన ముక్కు చుక్కలు రానున్నాయి. ఇవి మనం సెర్చ్ చేసిన విషయానికి సంబంధించిన సమాచారం ఎక్కడి నుండి వచ్చింది, దానిని నమొచ్చా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఏ వెబ్సైట్స్‌లోని సమాచారాన్ని నమ్మాలని యూజర్లు క్లారిటీ వస్తుంది.


సెర్చ్ బార్‌ను మాత్రమే కాదు యూట్యూబ్‌ను కూడా మెరుగుపరచాలని గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఏదైనా బ్రేకింగ్ న్యూస్ ఉన్నప్పుడు అది యూట్యూబ్ హోమ్‌పేజ్‌లో కనిపించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఫేక్ న్యూస్‌పై గూగుల్ చేస్తున్న పోరాటానికి మీడియా కూడా సపోర్ట్ ఇవ్వనుంది. ఫ్యాక్ట్‌షాలా అనే టెక్ కంపెనీ 15కు పైగా భాషల్లో వర్క్‌షాప్ నిర్వహించనుంది. అంతే కాకుండా ఫ్యాక్ట్ చెకింగ్ ట్రైనింగ్స్‌ను జర్నలిస్టులకు అందించనుంది గూగుల్.

క్వాలిటీ జర్నలిజం కోసం పాటుపడడానికి కూడా గూగుల్ సిద్ధమవుతోంది. తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్‌ను ఖండించడానికి, వ్యాప్తి చెందకుండా ఆపడానికి జర్నలిస్టులకు, మీడియా విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఫేక్ న్యూస్‌పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్న తర్వాత దీని గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవడం మొదలుపెట్టింది గూగుల్. స్టేక్‌హెల్డర్స్ సాయంతో ఫేక్ న్యూస్‌ను అదుపు చేసి, యూజర్లకు సరైన సమాధానాన్ని అందించాలని భావిస్తోంది.

ఏఐను అడ్డుకోవడానికి టెక్ దిగ్గజాల భారీ ప్లాన్..

for more updates follow this link:-Bigtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×