BigTV English

GPT 3:జీపీటీ 3లో కృత్రిమ మేధస్సుకు కొత్త ఫీచర్లు..

GPT 3:జీపీటీ 3లో కృత్రిమ మేధస్సుకు కొత్త ఫీచర్లు..

GPT 3:కృత్రిమ మేధస్సు అనేది పరిశోధనల నుండి రోజూవారి టెక్నాలజీలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు దానిని సాధారణ యూజర్లు కూడా యాక్సెస్ చేసేలా అందుబాటులోకి వచ్చింది. అందుకే యూజర్లకు ఏ మాత్రం అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు దానిని అప్డేట్ చేసేలా చూస్తున్నారు టెక్ నిపుణులు. తాజాగా మరో అప్డేట్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిద్ధంగా ఉంది.


లాంగ్వేజ్ మోడెల్స్‌కు గమనించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో జీపీటీ 3 అనే ఫీచర్ ఉంది. ఇది మనుషులు చేసినట్టుగా మెసేజ్‌లను తయారు చేయగలదు. ఇప్పటికే డేటాతో ట్రెయినింగ్ అయిన ఏఐ.. మనం టైప్ చేసే పదాన్ని బట్టి తర్వాత పదాన్ని టైప్ చేసుకుంటుంది. కానీ ప్రతీ మోడల్‌లో ఇలాగే జరుగుతుందని టెక్ పరిశోధకులు హామీ ఇవ్వడం లేదు. అందుకే వారు ఓ కొత్త ఫీచర్‌ను తయారు చేయనున్నారు.

ఇన్ కాంటెక్స్ లెర్నింగ్ అనే లాంగ్వేజ్ మోడల్‌ను పరిశోధకులు డెవలప్ చేయనున్నారు. ఇందులో ఏఐకు కొన్ని ఉదాహరణలను చూపించడం వల్ల ఎక్కువ పదాలను అర్థం చేసుకునేలా వారు డిజైన్ చేస్తున్నారు. ఇందులో టాస్క్ విషయంలో ఎక్కువగా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏఐకు ఉండదు. కేవలం ఉదాహరణలతోనే వాటిని అర్థం చేసుకొని ఫంక్షన్ అవుతాయి. కానీ ఈ మోడల్‌ను నేర్చుకోవడానికి జీపీటీ 3కు కొత్త డేటా అవసరం ఉంటుంది.


పారామీటర్స్‌ను అప్డేట్ చేయకుండా లాంగ్వేజ్ మోడల్స్ నేర్చుకోవడం ఎలా అనేదానిపై పరిశోధకులు క్షుణ్ణంగా పరిశోధనలు చేయనున్నారు. ఏ విధంగా చూసినా.. ఇన్ కాంటెక్స్ లెర్నింగ్ అనేది సులువైన లాంగ్వేజ్ మోడల్ అని వారు భావిస్తున్నారు. త్వరలోనే లాంగ్వేజ్ మోడల్స్‌లో మరింత మెరుగ్గా ఏఐ యూజర్ల ముందుకు రానుందని వారు హామీ ఇస్తున్నారు. ఇప్పటికే ఏఐ అనేది టెక్నికల్ వరల్డ్‌లోకి తుఫానులాగా వచ్చేసింది. ఇక ఈ అప్డేట్స్ వల్ల త్వరలోనే అది మరో సంచలనాన్ని సృష్టించనుందని టెక్ ప్రియులు అనుకుంటున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×