BigTV English

Green Technologie:-దేశాల మధ్య దూరం పెంచుతున్న గ్రీన్ టెక్నాలజీ..

Green Technologie:-దేశాల మధ్య దూరం పెంచుతున్న గ్రీన్ టెక్నాలజీ..

Green Technologie:-టెక్నాలజీలు పెరుగుతున్నకొద్దీ అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్న దూరం పెరిగిపోతూనే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు టెక్నాలజీలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ముందుకొళ్తుంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటిని అందుకోలేకపోతున్నాయి. దీనివల్ల ఎకానమీస్ మధ్య చాలా విబేధాలు ఏర్పడుతున్నాయని యూనైటెడ్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (అన్క్‌టాడ్) హెచ్చరించింది.


ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ లాంటి గ్రీన్ టెక్నాలజీల వల్ల దేశాల మధ్య, వాటి ప్రభుత్వాల మధ్య దూరం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆర్థికంగా వాటి మధ్య దూరం తగ్గించలేనంత మారిపోతోంది. ఉద్యోగాల పరంగా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువగా అవకాశాలు అందడం లేదు. అయితే ఈ విషయంలో ప్రభుత్వాలు ముందడుగు వేసి పెరుగుతున్న ఈ గ్యాప్‌ను తగ్గించాలని అన్క్‌టాడ్ సలహా ఇచ్చింది.

గ్రీన్ టెక్నాలజీలు అనేవి 2030లోపు విపరీతమైన మార్కెట్ వాల్యూను పెంచగలుగుతాయని అన్క్‌టాడ్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న గ్రీన్ టెక్నాలజీల్లో ఎకానమీ అభివద్ధికి ముఖ్యంగా 17 టెక్నాలజీలు తోడ్పడతాయని తెలిపింది. అవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, బ్లాక్‌చైన్, 5జీ, 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, సోలార్ ఫోటోవాల్టిక్, సోలార్ పవర్, బయోఫ్యూయల్స్, బయోగ్యాస్ అండ్ బయోమాస్, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, నానోటెక్నాలజీ, జీన్ ఎడిటింగ్.


పైగా ప్రస్తుతం ఉన్న గ్రీన్ టెక్నాలజీలు పర్యావరణానికి హాని కలగకుండా, కార్బన్ ఎక్కువగా గాలిలో కలిసిపోకుండా పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. 2018 నుండి 2021 మధ్య గ్రీన్ టెక్నాలజీల ఎగుమతి అమాంతం పెరిగిపోయింది. దీనిపైన భవిష్యత్తు ఆధాపడి ఉందని తెలుసుకున్న ప్రభుత్వాలు గ్రీన్ టెక్నాలజీను ఎప్పటికీ అందుబాటులో పెట్టుకోవాలని ఆశపడుతున్నాయి. అయితే గ్రీన్ టెక్నాలజీల వినియోగం పెరగడంతో పాటు దేశాల మధ్య దూరం కూడా తగ్గాలని అన్క్‌టాడ్ అనుకుంటోంది. త్వరలోనే దానికి తగిన సన్నాహాలు చేయాలని ప్రభుత్వాలను సూచించింది. మరి అన్క్‌టాడ్ చనువుతో అయినా దేశాల మధ్య దూరం తగ్గుతుందేమో చూడాలి.

భూమి పుట్టకముందు ఏం జరిగిందంటే..?

for more updates follow this link:-bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×