BigTV English

Vishnu Vs Manoj : అన్నదమ్ముల గొడవ ఇదే..! అప్పటి నుంచే చిచ్చు..!

Vishnu Vs Manoj : అన్నదమ్ముల గొడవ ఇదే..! అప్పటి నుంచే చిచ్చు..!

Vishnu Vs Manoj :కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య విభేదాలున్నాయని వార్తలు వచ్చాయి. మనోజ్- భూమా మౌనికారెడ్డి పెళ్లి సమయంలో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అందుకే మనోజ్ తన రెండో వివాహాన్ని గ్రాండ్ కాకుండా సింపుల్ గా చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకలో విష్ణు అంటీముట్టనట్టు వ్యవహరించాడు. మంచు లక్ష్మినే తమ్ముడి పెళ్లి వేడుకను దగ్గరుండి జరిపించింది. ఈ వివాహ వేడుకకు విష్ణు తన ఫ్యామిలీతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో అన్నదమ్ముల మధ్య ఏదో వివాదం నడుస్తోందని టాక్ వచ్చింది.


అన్నదమ్ముల వివాదాల నేపథ్యంలో మనోజ్ వద్ద పనిచేస్తున్న సారథి ఇంటికెళ్లి విష్ణు దాడికి దిగాడని తెలుస్తోంది. విష్ణు దాడిలో గాయపడిన సారథి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడి ఘటనపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన అన్న వ్యవహార శైలిని తప్పుపట్టాడు. దాడి చేయడం తగునా అని ప్రశ్నించాడు. అక్కడతో ఆగలేదు. దాడి దృశ్యాలను రిలీజ్ చేసి విష్ణు తీరును ప్రపంచానికి చూపించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

ఒకప్పుడు మంచు ఫ్యామిలీ ఒకే భవనంలో ఉండేది. కానీ కొంతకాలంగా వేర్వేరు ఇళ్లలో విష్ణు, మనోజ్ ఉంటున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య మంచి సంబంధాలులేవని మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలో తేలిపోయింది. ఆ సమయంలో మోహన్ బాబుతో విష్ణు సన్నిహితంగా ఉండగా .. మనోజ్ చాలా దూరంగా నిల్చున్నాడు. అలాగే రెండేళ్లుగా విష్ణకు మనోజ్ బర్త్ డే విషెస్ చెప్పడం లేదు. అంటే అప్పటి నుంచే అన్నదమ్ముల మధ్య విభేదాలున్నాయని స్పష్టమవుతోంది. అయితే వివాదానికి కారణాలేంటి? విభేదాలు ఎందుకొచ్చాయి? ఈ విషయం తెలియాలంటే విష్ణు గానీ, మనోజ్ కానీ బయటకొచ్చి మాట్లాడాలి.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×