E-Paper
Advertisement

Impact of GST on Rent : ఇక అద్దెలపైనా GST బాదుడు…

Impact of GST on Rent : ఇక అద్దెలపైనా GST బాదుడు…
Advertisement

Impact of GST on Rent : ఆగండాగండి. కంగారు పడకండి. అద్దెల మీదా GST బాదుడు ఏంటి అని హైరానా పడిపోవద్దు. ప్రస్తుతానికి ఇది అందరికీ కాదు. కేవలం GST కింద నమోదు చేసుకున్న అద్దెదారులకు మాత్రమే. ఈ సంగతేంతో కాస్త వివరంగా చూద్దాం…

GST కింద నమోదు చేసుకున్న అద్దెదారుడు… తాను యజమానికి చెల్లించే అద్దెపై 18 శాతం GST కట్టాల్సిందే. ఉదాహరణకు రూ.10 వేలు అద్దె చెల్లించే వ్యక్తి… 18 శాతం GST… అంటే… రూ.1800 ప్రభుత్వానికి చెల్లించాలి. వ్యాపారం లేదా వృత్తిని నిర్వహించే GST నమోదిత వ్యక్తులకు మాత్రమే ఈ బాదుడన్న మాట. ఈ నిబంధన 3 నెలల కిందటే… అంటే జులై 18 నుంచి అమల్లోకి వచ్చింది.

Advertisement

కార్యాలయాలు, స్థలాలు, వాణిజ్య ఆస్తుల్ని గతంలో అద్దె లేదా లీజుకు ఇస్తే… వాటిపై మాత్రమే GST చెల్లించాల్సి వచ్చేది. కార్పొరేట్ సంస్థలు లేదా వ్యక్తుల ద్వారా నివాస స్థలాల్ని అద్దె లేదా లీజుకు ఇస్తే GST ఉండేది కాదు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం, GST నమోదిత అద్దెదారుడు… రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే… ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద… చెల్లించిన GSTని మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అద్దెకు తీసుకున్న వ్యక్తి GST కింద రిజిస్టర్ అయినప్పుడు, GST రిటర్న్‌లను ఫైల్ చేస్తున్నప్పుడు మాత్రమే పన్ను వర్తిస్తుంది. అయితే ఆస్తిని అద్దెకు ఇచ్చిన వ్యక్తి GST చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అన్నింటి మీదా GST విధించి సమాన్యుల ముక్కు పిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం… త్వరలో అందరూ అద్దెలపైనా GST కట్టాలని మద్దెల దరువు వాయించినా ఆశ్చర్చపోనక్కర్లేదు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×