BigTV English

Heart Attack Causes : గుండె గడబిడ.. చిన్న వయస్సులో మరణాలు..కారణాలివే..

Heart Attack Causes : గుండె గడబిడ.. చిన్న వయస్సులో మరణాలు..కారణాలివే..
Heart Attack Causes


Heart Attack Causes : వయసుతో సంబంధం లేదు. పదో తరగతి పిల్లల నుంచి.. కొండలను సైతం పిండిచేసేంత మాంచి వయసులో ఉన్న యువత వరకు.. డాన్స్‌ చేస్తూ, జిమ్‌ చేస్తూ ఒకరు.. కూర్చున్న చోటే మరోకరు.. మాట్లాడుతూ ఇంకోకరు.. పనులు చేస్తూ కొందరు.. ఇలా ఉన్నచోటేనే వారి గుండె కొట్టుకోవడం ఆగిపోయి కుప్పకూలిపోతున్నారు.

ఇటీవల గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, మంత్రి గౌతమ్ రెడ్డి, హీరో తారకరత్న.. ఇప్పుడు గాయకుడు సాయి చంద్.. ఇలా చిన్నవయస్సులోనే హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు.


ఉన్నట్టుండి గుండెపోటుకు గురై అక్కడికక్కడే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పట్టరాని ఆనందం వచ్చినా, భయాందోళలకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కానీ ఎలాంటి కారణం లేకుండానే.. కొన్ని సెకన్ల పాటు గుండే వేగంగా కొట్టుకోవడం, తరుచూ అలా జరగడం గుండెపోటు లక్షణం అని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం 15-35 ఏళ్ల వారు కూడా గుండెపోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఉరుకుల పరుగుల జీవితం.. వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిళ్లు.. తాత్కాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లు.. నిద్రలేమి సమస్యలు సామాన్యులను తీవ్రంగా వేదిస్తున్నాయి. దూమపానం, మద్యపానం కూడా గుండెపోటుకు కారణమవుతున్నాయి.

ముఖ్యంగా కరోనా తర్వాత యువ గుండెకూ గాయాల పోటు తగులుతున్నది. 40 ఏళ్లలోపు వారు గుండెపోటు బారిన పడటం గత రెండు దశాబ్దాలుగా పెరుగుతున్నదని అనేక సర్వేలు చెబుతున్నాయి. కొవిడ్‌-19 బారినపడి చికిత్స తీసుకొన్నవారిలో 61 శాతం మందికి గుండె పోటు సహా ఇతర గుండె సంబంధిత సమస్యలు వస్తున్నట్టు తేలింది. కొవిడ్‌ టీకా తీసుకున్న కొందరిలో గుండె పోటు, హృద్రోగాల సమస్యలు వచ్చాయని జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. దీర్ఘకాలం గాలి కాలుష్యం బారిన పడినవారిలోనూ గుండె పోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది.

హృదయ స్పందనలో సమస్యలు ఏర్పడినప్పుడు గుండెలో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉందని, ఇదే రక్తం మెదడుకు వెళ్లినప్పుడు అక్కడ కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ధమనులు చిట్లడం, కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం కూడా గుండెపోటుకు దారి తీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. కొవిడ్‌ నుంచి బయటపడిన వారిలోనూ ఈ సమస్య ఉండటం వల్ల గుండె పోటు సంభవిస్తున్నదని వివరించారు.

కారణం ఏదైనా దేశంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పని చేస్తూ లేదంటే నిద్రిస్తూనే ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×