E-Paper
Advertisement

Maruti Invicto : మారుతీ ఇన్విక్టో.. ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేకంగా.

Maruti Invicto : మారుతీ ఇన్విక్టో.. ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేకంగా.
Advertisement
Maruti Invicto

Maruti Invicto price in India(Business news live): ప్యాసెంజర్ వెహికిల్స్‌లో కొన్ని కంపెనీలు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాయి. అందులో మారుతీ సుజుకీ కూడా ఒకటి. ముఖ్యంగా మారుతీ కార్లంటే మిడిల్ క్లాస్ వారికి కూడా అందుబాటు ధరలో ఉంటాయని అంటుంటారు. అలాంటి మారుతీ తన కాస్ట్‌లీయెస్ట్ కారును లాంచ్ చేసింది. ఈ లాంచ్ గురించే ఆటోమొబైల్ సంస్థలు కూడా మాట్లాడుకుంటున్నాయి. మారుతీ లాంచ్ చేసిన ఈ కాస్ట్‌లీ కారు పేరు ప్రీమియమ్ ఎమ్పీవీ ఇన్విక్టో.

Advertisement

తాజాగా మారుతీ లాంచ్ చేసిన ఇన్విక్టో ధర స్టార్టింగ్ ప్రైజ్ రూ.24.8 లక్షలుగా తెలుస్తోంది. మొత్తంగా దీని ధర రూ.24.8 నుండి 28.4 లక్షల మధ్యలో అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం. ఇప్పటికే అందుబాటులో ఉండే ధరల్లో కార్లు అమ్ముతారంటూ పేరు తెచ్చుకున్న మారుతీ.. ఇప్పుడు ప్రీమియం కార్ల సెక్టార్‌లో కూడా తన ముద్రను వేయాలని అనుకుంటోంది. ఇప్పటికే ఎమ్పీవీ విషయంలో మారుతీ 50 శాతం మార్కెట్ షేర్‌ను సాధించింది.

ఇన్విక్టో లాంచ్‌తో మారుతీ షేర్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఒక్కరోజుకే దాదాపు 4 శాతం పెరిగాయి. ప్రస్తుతం మారుతీ మార్కెట్ వాల్యూ రూ.10,519.95 కోట్లకు చేరుకుంది. ఇన్విక్టో లాంచ్ చేసిన రోజు స్టాక్ ధర 3.61 శాతం పెరిగి బీఎస్ఈలో రూ.9,994.50లో నిలిచింది. ఎన్‌ఎసీఈ విషయంలో 3.55 శాతం పెరిగి రూ.9,990.10కు చేరుకుంది. 52 వారాలలో ఎప్పుడూ లేనంత ఎక్కువకు ఈ షేర్ వాల్యూ పెరిగింది. ఇక సెన్సెక్స్ విషయంలో కూడా మారుతీ రికార్డ్‌ను సాధించింది.

Advertisement

ఎస్‌యూవీ ఇచ్చిన బూస్ట్‌తో మారుతీ ప్రీమియం వెహికిల్స్‌కు పాపులారిటీ పెరుగిందని నిపుణులు అంటున్నారు. ఇక ఇన్విక్టో లాంచ్‌తో ప్రీమియం వెహికిల్స్ విషయంలో కూడా మారుతీ ఇతర ఆటోమొబైల్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్‌యూవీ విషయంలో మారుతీ కావాల్సిన లాభాలను వెనకేసుకుందని, ఇన్విక్టో మార్కెట్ వాల్యూ కూడా పెరిగితే.. మారుతీ చాలామంది ప్రీమియం కస్టమర్లకు కూడా మోస్ట్ వాంటెడ్‌గా మారుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×