E-Paper
Advertisement

Rahul Gandhi : మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసు.. గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ..

Rahul Gandhi : మోదీ ఇంటి పేరుపై  వ్యాఖ్యల కేసు..  గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ..
Advertisement

Rahul Gandhi news update(Latest political news in India): రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యలు చేసిన కేసులో గుజరాత్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ ప్రాచ్చక్‌ తీర్పును వెల్లడించారు. సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్ కు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు.

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశించి విమర్శలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను నిరశిస్తూ గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువు నష్టం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సూరత్ కోర్టు విచారణ చేపట్టింది. రాహుల్‌ గాంధీ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

సూరత్‌ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రోజే పార్లమెంట్ సచివాలయం రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో రాహుల్ సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును.. అదనపు సెషన్స్ కోర్టులో అప్పీలు చేశారు. అయితే అదనపు కోర్టు కూడా రాహుల్ గాంధీకి విధించిన శిక్షను సమర్థించింది. దీంతో రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టుకు కూడా ఆ తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×