Big Stories

Chandrayaan 3 : చంద్రయాన్ 3పై లేటెస్ట్ అప్డేట్..

Chandrayaan 3 : కేవలం ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు తిరిగి చూసేలా చేసింది చంద్రయాన్ అనే ఒక ల్యాండ్‌మార్క్ మిషిన్. చంద్రయాన్ అనేది మరెన్నో ఇతర ప్రయోగాలకు, పరిశోధనలకు స్ఫూర్తిలాగా కూడా మారింది. అదే స్ఫూర్తితో, నమ్మకంతో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది ఇస్రో. కానీ అది వారు అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. అయినా కూడా చంద్రయాన్ 3ను ప్రారంభించింది. ప్రస్తుతం దీని గురించి ఒక తాజా అప్డేట్ బయటికొచ్చింది.

- Advertisement -

లాంచ్ వెహికిల్ మార్క్ 3 (ఎల్వీఎమ్ 3) రాకెట్ ద్వారా చంద్రయాన్ 3ను లాంచ్ చేయాలని ఇస్రో సన్నాహాలు చేస్తోంది. జులై 12న దీని లాంచ్ జరగనుంది అనే వార్త వైరల్‌గా మారింది. చంద్రయాన్ 2 అనేది శాటిలైట్‌తో అంతరిక్షంలోకి వెళ్లింది. కానీ చంద్రయాన్ 3 అలా కాదు. ఈసారి ఇందులో ఎలాంటి శాటిలైట్ ఉండడం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇందులో ఒక ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయని బయటపెట్టారు. జులై 12న బయల్దేరనున్న చంద్రయాన్ 3.. చంద్రుడిపై ల్యాండ్ అవ్వడం కోసం ఆగస్ట్ 23న ముహూర్తం ఖరారు చేశారు.

- Advertisement -

చంద్రుడిపై రోవర్‌ను ఎలా ల్యాండ్ చేయాలి, ల్యాండ్ అయిన తర్వాత సైంటిఫిక్‌గా పరిశోధనలకు ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడమే చంద్రయాన్ 3 లక్ష్యం అని తెలుస్తోంది. చంద్రయాన్ 3 తయారు చేయడానికి ఖర్చు రూ. 615 కోట్లు అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇప్పటివరకు చంద్రయాన్ 2 కోసం రూ.960 కోట్లు, చంద్రయాన్ 1 కోసం రూ. 386 కోట్లు ఖర్చు పెట్టామని వారు చెప్తున్నారు. చంద్రయాన్ 2 అనేది ఎన్నో ఆశలతో భూమి నుండి బయలుదేరి.. చంద్రుడిపైన ల్యాండ్ అవ్వకముందే క్రాష్ అయిపోయింది. అందుకే చంద్రయాన్ 3 పైనే శాస్త్రవేత్తలు ఆశలు పెట్టుకున్నారు.

చంద్రయాన్ 3 అనేది చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలో ఆగనుంది. అక్కడ ల్యాండర్ అనేది చంద్రయాన్ నుండి విడిపోయి చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. దాంతో చంద్రుడి నేలపై వాతావరణం ఎలా ఉంటుంది లాంటి మరెన్నో ఇతర విషయాలపై పరిశోధనలు జరగనున్నాయి. ఈ పరిశోధనల్లో ఇస్రోతో పాటు నాసా కూడా కొంత సాయం చేసినట్టు తెలుస్తోంది. 2008లో తయారైన చంద్రయాన్ 1 సక్సెస్ అనేది మళ్లీ చంద్రయాన్ 3తో రిపీట్ అవ్వాలని శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News