BigTV English

Vontimitta Ramalayam Temple : జాంబవంతుడు ప్రతిష్టించిన రామాలయం.. ఒంటిమిట్ట

Vontimitta Ramalayam Temple : జాంబవంతుడు ప్రతిష్టించిన రామాలయం.. ఒంటిమిట్ట
Vontimitta Ramalayam Temple

Vontimitta Ramalayam Temple : తెలుగు నేలపై అద్భుతమైన ఆలయాల్లో ఒంటిమిట్ట రామాలయం ఒకటి. అటు పౌరాణిక.. ఇటు చారిత్రక విశేషాలు గల నాటి ఏకశిలానగరమే.. నేటి ఒంటిమిట్టగా మారింది.


కడప నగరానికి 20 కి.మీ దూరంలో ఉన్న ఈ ఒంటిమిట్ట ఆలయంలోని మూలమూర్తిని సాక్షాత్తూ జాంబవంతుడే ప్రతిష్టించాడని పురాణ కథనం.

త్రేతాయుగంలో సీతాపహరణం తర్వాత రాముడికి సుగ్రీవుడు, హనుమంతుడితో బాటు జాంబవంతుడూ అండగా నిలుస్తాడు. రామావతారం తర్వాత ద్వాపరయుగంలో శమంతకమణి అన్వేషణలో భాగంగా జరిగిన యుద్ధంలో కృష్ణుడు.. జాంబవంతుడిని ఓడిస్తాడు. అనంతరం ఆ భల్లూకరాజు.. తన కుమార్తె జాంబవతిని కృష్ణునికి ఇచ్చి వివాహం చేస్తాడు.


రెండు యుగాల్లో.. రామ, కృష్ణ అవతారాల్లో వచ్చిన పరమాత్మకు సేవ చేసుకున్నాననే సంతోషంతో జాంబవంతుడు.. భూలోకంలో రామాలయం కట్టాలని అనుకుని, ఒంటిమిట్ట చేరి, ఒకే శిలపై సీతా లక్ష్మణ సమేతుడైనా రామచంద్రుని విగ్రహాన్ని చేయించి, స్వయంగా ప్రతిష్టించాడట.

కాలగతిలో ఈ ఆలయం నేలలో కలసిపోయింది. క్రీ.శ 1340లో ఈ ఆటవీ ప్రాంతానికి వచ్చిన నాటి ప్రభువైన కంపరాయలు(విజయనగర సామ్రాజ్య స్థాపకుడైన బుక్కరాయలి కుమారుడు) ఇక్కడికి వేటకు వచ్చాడట.

ఆ సమయంలో ఒంటడు, మిట్టడు అనే బోయ నాయకులు.. రాజుకు అడవిలో సపర్యలు చేయగా, రాజు ఏదైనా కోరుకోమని అడగ్గా, పాడుపడిన గుడికి బదులు.. కొత్త గుడి కట్టమని కోరతారు.

దీనికి సరేనన్న కంపరాయలు.. వనరులు మంజూరుచేయటమే గాక.. ఆ గుడి నిర్మాణ పర్యవేక్షణను ఆ బోయ నాయకులకే ఇచ్చారు. అదే నేడు మనం చూస్తున్న ఒంటిమిట్ట ఆలయం.

శ్రీరామనవమికి అన్నిచోట్లా మధ్యాహ్నపు వేళ శ్రీరామ కళ్యాణం జరుగుతుండగా, ఒక్క ఒంటిమిట్టలో మాత్రం చైత్రమాసంలో నవమి తర్వాత వచ్చే పున్నమి నాటి రాత్రి.. ఆరుబయట ఆ వేడుక జరుగుతుంది. దీనికీ బుక్కరాయల నిర్ణయమే కారణం.

గుడి కట్టిన తర్వాత బుక్కరాయులు సీతారామ కళ్యాణానికి లగ్నం నిర్ణయించారు. కానీ.. ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి సమయంలో రావటంతో బుక్కరాయలు రాత్రివేళనే కళ్యాణం జరిపారట. నాటి నుంచి అదే సంప్రదాయంగా వస్తోంది.

ఎర్రని రాయితో నిర్మితమైన ఈ ఆలయంలోని శిల్పాలు నాటి.. చోళ, విజయనగర కాలపు కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఈ ఆలయంలో ఆంజనేయుడు.. స్వామి పాదాల వద్ద గాక.. మూలమూర్తికి ఎదురుగా ఉన్న ఉపాలయంలో స్వామి పాదాలను చూస్తున్నట్లుగా కనిపిస్తాడు.

క్రీ.శ. 1652లో భారత యాత్ర చేసిన టావెర్నియర్‌ అనే ఫ్రెంచి యాత్రికుడు భారత్‌లోని అత్యంత గొప్ప ఆలయాల్లో ఒంటిమిట్ట ఓ అద్భుతమని ప్రశంసించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామనవమి వేడుకలు ఈ ఆలయంలోనే జరుగుతున్నాయి

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×