BigTV English

Hair Fall : జుట్టు రాలడానికి ప్రధాన కారణాలివే

Hair Fall : జుట్టు రాలడానికి ప్రధాన కారణాలివే

Hair Fall : ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. తలపై వెంట్రుకలు ఊడిపోవడానికి కారణాలు వందల్లోనే ఉన్నాయి. వాతావరణంలోని కాలుష్యం, మన ఆహారం అలవాట్లు, పని ఒత్తిడి, కెమికల్స్‌ వాడటంతో జుట్టు రాలిపోతుంటుంది. జుట్టు రాలిపోవడానికి గల ప్రధాన సమస్యలను ఇప్పుడు తెలుసుకుందాం.


విటమిన్లు, పోషకాలు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. జింక్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన.. కార్టిసోన్, ఆడ్రినలిన్ స్థాయిలను పెంచుతాయి. ఫలితంగా జుట్టు పెరుగుదల ఆగిపోవడంతో పాటు రాలిపోతుంది. జుట్టు రాలడం అనేది వారసత్వంగా కూడా వస్తుంది. మహిళల్లో రుతువిరతి, మగవారిలో ఆడ్రోపాజ్ హార్మోన్లు తగ్గడంతో కూడా జుట్టు రాలడం బాగా పెరుగుతుంది.

ఐరన్‌ లోపము కూడా ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఐరన్‌ తలతో సహా కణజాలాలను ఆక్సిజనేట్‌ చేయడానికి సహాయం చేస్తుంది. కేశాలకు రసాయన ఉత్పత్తులను అధికంగా వాడటం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. మహిళల్లో డెలివరీ తర్వాత హార్మోన్ల స్థాయి తగ్గడం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కూడా వెంట్రుకలు డ్యామేజ్‌ అవుతాయి. ఎక్కువ వేడి ఉన్న నీళ్లు తలకు పోసుకోవడం వల్ల వెంట్రుకలకు సంబంధించిన ఫోలీ సెల్స్‌ తెరుచుకుంటాయి. దీంతో వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది.


బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల కూడా జుల్లు రాలుతుందని అంటున్నారు. ఎక్కువ సేపు హెల్మెట్‌ ధరించడం వల్ల తలలో చెమట పట్టి కురుల మూలాలు బలహీనపడతాయి. అందుకే చిన్నవయస్సువారిలో కూడా బట్టతల వస్తోంది. గట్టిగా తల దువ్వడం, తడిమీద దువ్వుకోవడం, గట్టిగా ముడివేయడం కూడా కారణాలుగా చెబుతున్నారు. జుట్టును గట్టిగా బ్యాండ్లు, క్లిప్పులతో బంధించడం వల్ల కూడా మధ్యలో తెగిపోయే ప్రమాదం ఉందంటున్నారు.

Related News

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Big Stories

×