BigTV English

Srilanka vs Bangladesh : టైమ్డ్ అవుట్..గ్రౌండ్ లో అసలు జరిగింది ఇది..!

Srilanka vs Bangladesh : టైమ్డ్ అవుట్..గ్రౌండ్ లో అసలు జరిగింది ఇది..!
Srilanka vs Bangladesh

Srilanka vs Bangladesh : టైమ్డ్ అవుట్..క్రికెట్ లో ఈ మధ్యకాలంలో ఇంత హాట్ టాపిక్ గా మారిన అంశం మరొక్కటి లేదు. ఎందుకంటే క్రికెట్ పుట్టి ఇన్నేళ్లయినా, ఏరోజూ ఇలా టైమ్డ్ అవుట్ కింద ఎవరూ అవుట్ కాలేదు. నిజానికి చాలామంది క్రికెట్ వీరాభిమానులకి అసలు టైమ్డ్ అవుట్ అనేది ఒకటుందనే సంగతి కూడా తెలిసి ఉండదని కొందరంటున్నారు. క్రికెట్ అభిమానులకే కాదు, నేటి యువతరం క్రికెటర్లకి కూడా తెలిసి ఉండదని కొందరు సెటైర్లు పేల్చుతున్నారు.


 ఇదిలా ఉండగా ఆరోజు శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగిన అరుణ్ జైట్లీ స్డేడియం గ్రౌండ్ లో ఏం జరిగిందో, విండీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బిషప్ వెల్లడించాడు. ఎందుకంటే చాలామంది టీవీలో మాత్రమే చూశారు. తర్వాత సీనియర్లు కామెంట్లు విన్నారు. అసలు గ్రౌండ్ లో ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. అదే విషయాన్ని ఇయాన్ బిషప్ పూసగుచ్చినట్టు వెల్లడించాడు.

మాథ్యూస్ 25 ఓవర్ లో నిబంధనలకు వ్యతిరేకంగా మూడు నిమిషాల సమయాన్ని తీసుకున్నాడు కాబట్టి, ఐసీసీ నిబంధనల ప్రకారం అతన్ని టైమ్డ్ అవుట్ గా ప్రకటించాలని అంపైర్లను బంగ్లా కెప్టెన్ షకీబ్ అలి హసన్  అప్పీల్ చేశాడు.
నిబంధనల ప్రకారం అంపైర్లు చాలాసేపు చర్చించి, అతని దగ్గరకు వెళ్లి షకీబ్ ని రెండుసార్లు అడిగారు.
మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? అని అంటే, అతను రెండుసార్లు కూడా లేదు, లేదు అని సమాధానం చెప్పాడు.


దాంతో చేసేది లేక మ్యాథ్యూస్ ని అంపైర్లు అవుట్ గా ప్రకటించారు. టైమ్డ్ అవుట్ అనే దాంట్లో ఒక క్లాజ్ ప్రకారం  ఒకవేళ మానవతా ద్రక్ఫథంతో కెప్టెన్ ఆలోచిస్తే, ఆ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవచ్చు అని ఉంది. అందుకే ఒకటికి రెండుసార్లు అంపైర్లు అడిగినా, ఆఖరికి మాథ్యూసే మూడు నాలుగు సార్లు రిక్వెస్ట్ చేసిన షకీబ్ కసికందలేదు.

ఇక చేసేది లేక టైమ్డ్ అవుట్ గా ప్రకటించాల్సి వచ్చింది. ఇక్కడే షకీబ్ తప్పుకి దొరికిపోయాడు. ఆ క్లాజ్ గానీ లేకపోతే, అసలు సమస్యే లేదు. ఎవరూ మాట్లాడరు. తిరిగి మాథ్యూస్ నే తిడతారు. హెల్మెట్ ఎలా ఉందో ముందే చూసుకోవడం తెలీదా? అని మందలిస్తారు.

అయితే మూడు నిమిషాల దగ్గరే మాథ్యూస్ టైమ్ తీసుకున్నాడు. కనీసం ఐదు నిమిషాలో, ఆరు నిమిషాలైనా కాదు. అందుకే ఆ విషయాన్ని షకీబ్ అంత సీరియస్ గా తీసుకోవల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకే ఇది మరింత వివాదాస్పదమైంది.

అయితే ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఒకసారి క్రీజులోనే ఆరు నిమిషాలు ఆలస్యం చేశాడు.  అప్పటికి అంపైర్లు వెళ్లి సౌతాఫ్రికా కెప్టెన్ ని అడిగారు. టైమ్డ్ అవుట్ ఇద్దామా? అతను సీరియస్ గా తీసుకోలేదు. దాంతో తను బతికి బట్టకట్టాడు.చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఇదేటి మూడు నిమిషాలకే అవుట్ చేసేస్తే ఎలా? అని కొందరు ఈ సంఘటనను కోట్ చేస్తున్నారు.

క్రికెట్ కి జంటిల్మెన్ గేమ్ అని పేరు కదా..అందుకే అలా కూడా షకీబ్ వ్యవహరించాల్సి ఉండాల్సింది కాదని కూడా అంటున్నారు. కానీ జీవితంలో ఇంతటి వివాదాన్ని మూటగట్టుకుంటాడని షకీబ్ కూడా ఊహించి ఉండడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×