gunturu kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్స్, డ్యాన్సులు చూసి అభిమానులకు పూనకాలు వచ్చేశాయి. ఇప్పుడీ చిత్రం భారీగా కలెక్షన్లను వసూలు చేస్తోంది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు రూ.200 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మిక్స్ టాక్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద నిలబడి కాసుల వర్షం కురిపించింది.
ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, జయరాం, రమ్యకృష్ణ, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగానే.. ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఊహించిన దాని కంటే ముందుగానే.. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లెక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందట. దీంతో ఈ మూవీ నెల తిరగకుండానే స్ట్రీమింగ్ కాబోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీన నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని సమాచారం.