E-Paper
Advertisement

Huge Discounts on Tesla Cars: పెరిగిన పోటీ.. టెస్లా కార్లపై భారీ డిస్కౌంట్స్…

Huge Discounts on Tesla Cars: పెరిగిన పోటీ.. టెస్లా కార్లపై భారీ డిస్కౌంట్స్…
Advertisement

Huge Discounts on Tesla Cars:టెస్లా అధినేత ఎలాన్ మస్క్… తన ఎలక్ట్రిక్ కార్లను భారీ తగ్గింపు ధరలకు అమ్మేస్తున్నాడు. అయితే అది అన్ని చోట్లా కాదు. కైవలం చైనాలో మాత్రమే. అక్కడ విద్యుత్ వాహన రంగంలో పోటీ రోజురోజుకూ పెరిగిపోతుండటంతో… దాన్ని తట్టుకుని నిలబడటం కోసమే టెస్లా కార్లను భారీ తగ్గింపు ధరలకు అమ్మేస్తున్నాడు… మస్క్. చైనాలో Y మోడల్ కారు ధర ఏకంగా 43 శాతం తగ్గగా… 3 మోడల్ ధర 30 శాతం దిగివచ్చింది.

మోడల్‌ Y ఎస్‌యూవీ ధరను 2,88,900 యువాన్ల నుంచి 2,59,900 యువాన్లకు తగ్గించింది… టెస్లా. లాంచ్ చేసినప్పుడు దీని ధర 65,900 డాలర్లు. దాంతో పోలిస్తే ధర ఏకంగా 43 శాతం తగ్గింది. తాజా తగ్గింపుతో 3 మోడల్‌ ధర కూడా 30 శాతం దిగొచ్చి… 2,29,900 యువాన్లకు చేరింది. మరోవైపు… ప్రీమియం విభాగంలో పట్టు పెంచుకునేందుకు కొత్తగా ‘మోడల్‌ S’ సెడాన్‌ మోడల్‌ను, మోడల్‌ ఎక్స్‌ను ప్రవేశపెట్టింది.

Advertisement

దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్‌ బఫెట్‌ మద్దతు ఉన్న బీవైడీ కంపెనీతో పాటు… ఎక్స్ పెంగ్, నియో, పోర్షే ఏజీ, మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి చైనాలో టెస్లాకు గట్టి పోటీ ఎదురవుతోంది. దాన్ని తట్టుకొని మాస్‌, ప్రీమియం సెగ్మెంట్లలో పట్టు నిలుపుకోవడం కోసమే టెస్లా ధరల తగ్గింపు వ్యూహాన్ని అమలు చేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్‌ Sలో ఇంటీరియర్‌ను సరికొత్తగా తీర్చిదిద్దామని టెస్లా తెలిపింది. చైనాలో దీని ధర 7,89,900 యువాన్లుగా పేర్కొంది. 2.1 సెకన్లలోనే గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకోగల ప్లెయిడ్‌ వెర్షన్‌ ధరను 1.01 మిలియన్‌ యువాన్లుగా నిర్ణయించింది. అలాగే మోడల్‌ X ఎస్‌యూవీ ధర 8,89,900 యువాన్లు అని, ప్లెయిడ్‌ వెర్షన్‌ ధర 1.04 మిలియన్‌ యువాన్లు అని టెస్లా వెల్లడించింది.

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×