Humanoid Robots:మనుషులు సహజంగా రోజులో ఎన్నో పనులు చేస్తుంటారు. కింద కూర్చోవడం, టేబుల్ మీద నుండి ఏదైనా తీసుకోవడం, వస్తువులను జరపడం లాంటివి ఎన్నో పనులను చేయాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడానికి శరీరాన్ని బాగా కదిలించవలిసి ఉంటుంది. వస్తువులను పట్టుకోవడం, ముట్టుకోవడం లాంటివి చేయవలసి ఉంటుంది. అందుకే రోబోలకు ఈ ఫంక్షన్స్ అన్నీ చేయడం కష్టమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
రోబోలకు డిజైన్ చేసిన ఫంక్షన్స్‌ను మాత్రమే అవి చేయగలవు. డిజైన్ చేసినవి కాకుండా ఇతర ఫంక్షన్స్ చేయాలనుకుంటే వాటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మనుషులు చేసే ప్రతీ ఫంక్షన్‌ను అర్థం చేసుకునేలా, నేర్చుకునేలా ఒక రోబోను తయారు చేయాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అంటే వారొక ఇంటరాక్టివ్ సైబర్ ఫిజికల్ హ్యూమన్ (ఐసీపీహెచ్)ను తయారు చేయబోతున్నారు.
టోక్యూ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ చేపడుతున్న ఈ పరిశోధనల్లో మనుషులు చేసే ప్రతీ కదలికలను రోబోలు కూడా చేసేలా డిజైన్ చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేయనున్నారు. ఇప్పటికే హ్యూమనాయిడ్ రోబోలు అనేవి మార్కెట్లో ఉన్నవి. అవి చూడడానికి మనుషులకు ట్విన్‌లాగా ఉన్నా.. అన్ని ఫంక్షన్స్‌ను చేయలేవు. దానికి మరింత ఫీచర్స్‌ను జతచేసి ఐసీపీహెచ్ రోబోలను డిజైన్ చేయాలని వారు సన్నాహాలు చేస్తున్నారు.
మనుషులు చేసే ప్రతీ కదలికలను రోబోలు ఎలా చూసి నేర్చుకుంటాయి అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ మనుషుల కదలికలను షేప్, స్ట్రక్చర్, యాంగిల్, వెలొసిటీ, ఫోర్స్ లాంటి వాటితో కొలవవచ్చు. వాటిని బట్టి రోబోలు ఆ కదలికలను గమనించి రికార్డ్ చేసుకొని అలాగే చేసే ప్రయత్నం చేస్తాయి. దీన్ని బట్టి మనుషుల కదలిక ఎలా ఉంది, దాన్ని చూసి రోబోలు కూడా అలాగే చేస్తున్నాయా లేదా అన్న విషయాలను శాస్త్రవేత్తలు గమనించనున్నారు.
మనుషుల కదలికలను ఒక మెషీన్ ద్వారా రోబోలకు నేర్పిస్తారు శాస్త్రవేత్తలు. ఒకటి తర్వాత ఒకటి సీక్వెన్స్‌గా రోబో మెదడులో స్టోర్ చేయబడతాయి. డేటా అనేది పూర్తిగా వాటి మెదడులో స్టోర్ అయిన తర్వాత దాన్ని బట్టి రోబోల కదలికలు ఉంటాయని వారు చెప్తున్నారు. చుట్టుపక్కల మార్పులను గమనిస్తూ తమ కదలికలను మార్చుకునేలా ఈ రోబోల డిజైనింగ్ ఉంటుందన్నారు. ఇతర విభాగాల సహాయంతో ఈ పూర్తిస్థాయి హ్యూమనాయిడ్ రోబోను మార్కెట్లో లాంచ్ చేసే రోజు దగ్గర్లోనే ఉంది అని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.