BigTV English
Advertisement

Hyundai:’వెర్నా’ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయిందిగా!

Hyundai:’వెర్నా’ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయిందిగా!

Hyundai:దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ కార్ల కంపెనీ హ్యుందాయ్.. సరికొత్త ‘వెర్నా’ను లాంచ్ చేయబోతోంది. గత మోడళ్ల కంటే భిన్నంగా… కొత్త లుక్, డిజైన్‌తో వెర్నాను తీర్చిదిద్దింది. ఇప్పటికే రూ.25 వేలతో వెర్నా బుకింగ్స్ ప్రారంభించింది… హ్యుందాయ్.


కొత్త హ్యుందాయ్ వెర్నా… సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్‌తో కొత్తగా కనిపిస్తోంది. చూడటానికి ఇది హ్యుందాయ్ ఎలంట్రా, గ్రాండియర్ సెడాన్ మాదిరే ఉంది. స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ లాంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తోంది… హ్యూందాయ్. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్, ఫ్లాట్‌ బానెట్, డోర్లపై క్యారెక్టర్ లైన్స్, స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. కారు వెనుక భాగంలో… డిక్కీ పొడవునా లైట్ బార్ ఇచ్చారు. డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్స్, వెంటిలేటెడ్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్‌తో పాటు ADAS టెక్నాలజీతో వెర్నాను రూపొందించారు. మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అమర్చారు.

ఇక కొత్త వెర్నా… కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఈ కారుకు ఇవ్వలేదు. 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో… 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను వెర్నాలో అమర్చారు. EX, S, SX, SX(O) వేరియంట్లలో మొత్తం 14 ఆప్షన్లతో కొత్త వెర్నా అందుబాటులోకి రానుంది. అయితే, దీని ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు… హ్యుందాయ్. కంపెనీ వెబ్ సైట్లో రూ.25,000 చెల్లించి బుక్ చేసుకునే సమయంలో కూడా కారు ధర పేర్కొనలేదు.


Tax:ఎంత ట్యాక్స్ కట్టాలో సింపుల్‌గా తెలుసుకోండి..

OnePlus:వన్‌ ప్లస్‌ 11R 5G.. ప్రీ-ఆర్డర్‌ చేశారా?

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×