BigTV English

ChatGPT:చాట్‌జీపీటీపై పెరుగుతున్న నిషేధాలు

ChatGPT:చాట్‌జీపీటీపై పెరుగుతున్న నిషేధాలు

ChatGPT:చాట్‌జీపీటీ. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే సంచలనం. ఏదైనా సమాచారాన్ని క్షణాల్లో వెతికిపెట్టడం కాకుండా… కోరుకున్న విధంగా ఇవ్వడం దీని ప్రత్యేకత. అయితే, దీన్ని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చాట్‌బాట్ పనితీరుపై… అందులో పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్‌కు అప్పుడే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బింగ్‌లో చాట్‌జీపీటీ ఊహించని విధంగా స్పందించిందని ఆ సంస్థ అంగీకరించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చాట్‌జీపీటీపై నిషేధాలు పెరుగుతున్నాయి.


ఇంతకుముందే బెంగళూరులోని ఆర్‌వీ యూనివర్సిటీ, న్యూయార్క్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌… చాట్‌జీపీటీ వాడకాన్ని నిషేధించాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ కూడా దాన్ని నిషేధించిన విద్యాసంస్థల జాబితాలో చేరింది. చాట్‌జీపీటీ సహా కృత్రిమ మేధ ఆధారిత టూల్స్‌ను వాడొద్దని యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ ఆదేశాలు జారీ చేసింది. అసైన్‌మెంట్లు సహా ఏ ప్రాజెక్టునైనా పూర్తి చేయడానికి విద్యార్థులు దాని సాయం తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బోధించేటప్పుడు ప్రొఫెసర్లు కూడా చాట్‌జీపీటీని వాడొద్దని ఆదేశించింది. దాని నైతికతపై అభ్యంతరం వ్యక్తం చేసిన యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్… చాట్‌జీపీటీని వాడితే విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రొఫెసర్ల అనుమతి లేకుండా చాట్‌జీపీటీని ఉపయోగించి అసైన్‌మెంట్‌ పూర్తి చేస్తే… విద్యార్థులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ హెచ్చరించింది. దీన్ని ప్లేజరిజంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్‌ ఉపయోగించినట్లు అనుమానం వస్తే… ఓరల్ టెస్ట్ ద్వారా వారి సామర్థ్యాన్ని నిర్ధారించుకుంటామని తెలిపింది. భవిష్యత్‌లో ఏఐకి ఉన్న ప్రాధాన్యంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని, ఆ టూల్స్ విద్యా సంస్థలకు ఎలా ఉపయోగపడతాయి? వాటికి సమర్థంగా ఎలా అమలు చేయాలి? అనే అంశాలపై స్పష్టత రావాలని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అభిప్రాయపడింది.


Ernie: చాట్‌జీపీటీకి బైదూ చెక్.. పోటీగా ఎర్నీ

Lamborghini Cars: లగెత్తిన లంబోర్గిని సేల్స్

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×