Big Stories

Indian Science and Technology: ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీని వెనక్కి నెడుతున్న సమస్యలు..

Indian Science and Technology : సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతగానో అభివృద్ధి చెందింది, చెందుతోంది. అయితే ఇండియాపై ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని నిపుణులు గమనిస్తూనే ఉన్నారు. అన్ని దేశాలోలాగానే ఇండియాలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మంచితో పాటు ఎంతోకొంత చెడు కూడా చేస్తుందని తెలుస్తోంది. అదే విషయాన్ని వారు కూడా బయటపెట్టారు.

- Advertisement -

అభివృద్ధి చెందిన దేశాలకు ఉన్న వనరులు, పెట్టుబడులు.. ఇండియాలో అంతగా లేకపోవడంతో అసలు ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎక్కవ వెనకబడింది అనే విషయాన్ని నిపుణులు పరిశీలించడం మొదలుపెట్టారు. అందులో ముందుగా వారికి అతిపెద్ద సమస్యగా కనిపించింది ఫండింగ్. పెట్టుబడుల విషయంలోనే ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎన్నో సమస్యలను ఎదుర్కుంటుందని నిపుణులు చెప్తున్నారు. పెట్టుబడులతో ప్రోత్సాహం దక్కకపోవడం వల్లే చాలామంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు కొత్త కొత్త ప్రయోగాలను చేయలేకపోతున్నారని అన్నారు.

- Advertisement -

మౌలిక సదుపాయాలు కూడా ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీని వెనక్కి నెట్టేస్తున్నాయి. దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నా కూడా అందులో ఎక్కువగా సదుపాయాలు లేకపోవడం అనేది పరిశోధకులకు ఇబ్బందిగా మారింది. కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించే వీలు లేక ఔట్‌డేటెడ్ టెక్నాలజీపైనే శాస్త్రవేత్తలు ఆధారపడుతున్నారు. దీంతో పాటు ఎంతోమంది ప్రతిభ ఉన్న విద్యార్థులు, శాస్త్రవేత్తలు.. మంచి అవకాశాల కోసం, జీతం కోసం దేశాన్ని విడిచి వెళ్లిపోవడం కూడా ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేగాన్ని అడ్డుకుంటోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News