Big Stories

Viveka Murder Case: హైకోర్టులో అవినాష్‌రెడ్డి తరఫు లాయర్ వాదనలు ఇవే.. అన్నిగంటలు ఏం వాదించారంటే..

avinash reddy high court

Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డికి కీలకమైన రోజు ఇది. ఈ రోజు కలిసొస్తే ముందస్తు బెయిల్ వచ్చినట్టే. లేదంటే సీబీఐ ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేయొచ్చు. అందుకే, ఆయన తరఫు లాయర్లు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు తమవంతుగా సుదీర్ఘ వాదనలు వినిపించారు.

- Advertisement -

ఇప్పటి వరకు వివేకా హత్య కేసులో జరిగిన పరిణామాలన్నిటినీ జడ్జికి వివరించారు అవినాష్‌రెడ్డి తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు. ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు, కోర్టుల్లో జరిగిన పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినాష్ నిందితుడని సీబీఐ ఎక్కడా చెప్పలేదన్నారు. గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్టు కాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ టికెట్‌పై అవినాష్‌రెడ్డిని సీబీఐ అనుమానిస్తోందని.. అయితే, వివేకా ఓటమికి కారణాలను సాక్షులే వివరించారని.. స్థానిక నేతలు సహకరించక పోవడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారని ఆ సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు విన్నవించారు అవినాష్ తరఫు లాయర్.

- Advertisement -

ఏ1 గంగిరెడ్డికి వివేకాతో భూ వివాదాలు ఉన్నాయని.. సునీల్, ఉమాశంకర్‌కు వివేకాతో వ్యాపారంలో విబేధాలున్నాయని.. డ్రైవర్‌గా దస్తగిరిని తొలగించి.. ప్రసాద్‌ను పెట్టుకున్నారని.. పలు అంశాలు ప్రస్తావించారు. అవినాష్‌రెడ్డి ఇస్తానన్నారని చెబుతున్న 4 కోట్లతో ఆయనకు సంబంధమేంటి? గంగిరెడ్డి కోటి ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.. ఆ డబ్బులు అవినాష్‌రెడ్డి ఇచ్చారని గంగిరెడ్డి చెప్పారా? దస్తగిరి తీసుకున్న కోటిలో 46.70 లక్షలే రికవరీ చేశారని.. మిగతా సొమ్మంతా ఏమైందో సీబీఐ చెప్ప లేదన్నారు. ఇక, భాస్కర్‌రెడ్డి కోసం ర్యాలీలు జరిగితే అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటని.. అవినాష్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేసినట్టు ఎక్కడైనా కేసు నమోదైందా అని ప్రశ్నించారు. 

మొదటి రెండు ఛార్జిషీట్లలో అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చలేదని.. అప్పటి వరకు కనీసం విచారణ కూడా జరపలేదని.. అనుబంధ ఛార్జిషీట్ వేసిన ఏడాది తర్వాత 160 నోటీసులు ఇచ్చారని తప్పుబట్టారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగానే అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ అంటోందని కోర్టుకు తెలిపారు. అవినాష్‌ను విచారించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లు కోర్టు ముందుంచాలని.. సీబీఐకి దురుద్దేశం లేకపోతే.. కస్టోడియల్ విచారణ జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

తల్లికి అనారోగ్యం వల్ల అవినాష్‌రెడ్డి విచారణకు హాజరు కాలేకపోయారని.. ఆ విషయం దర్యాప్తు అధికారికి సమాచారం ఇచ్చారని చెప్పారు. ఇన్నాళ్లూ లేనిది ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ ఎందుకు అవినాష్‌పై ఒత్తిడి తెస్తోందని ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ముందు గట్టిగా వాదనలు వినిపించారు. ఈ వాదన కొన్నిగంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఆ తర్వాత తమకూ అంతే సమయం ఇవ్వాలంటూ అక్కడే ఉన్న వైఎస్.సునీతా అడగడంతో.. మధ్యలో జోక్యం చేసుకోవద్దంటూ అసహనం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. తనకు ఈ కేసు గురించి డీటైల్స్ తెలీవని.. అందుకే తాను అడిగితేనే వివరాలన్నీ చెప్పారని అన్నారు.

అవినాష్ తరఫు వాదనలు పూర్తయ్యాక.. సునీత తరఫు లాయర్ ఎల్.రవిచంద్ర వాదనలు వినిపించారు. విచారణకు రావాలని సీబీఐ నోటీసు ఇచ్చినప్పుడల్లా అవినాష్‌రెడ్డి  ఏదో ఒకటి చెబుతున్నారని అన్నారు. మొదట పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనన్నారు.. రెండో నోటీసుకు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.. మరోసారి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు.. ఇప్పుడు తల్లి అనారోగ్యం అంటున్నారు.. అని కోర్టుకు తెలిపారు. అవినాష్ రెడ్డి అమాయక ఎంపీ కాదని.. బలమైన నాయకుడని.. కర్నూలు ఆస్పత్రి దగ్గర వందల మంది అనుచరులు కార్పెట్లు వేసుకొని ధర్నాలు చేశారని.. ఆస్పత్రిలోకి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ ఆ ఫోటోలను కోర్టుకు సమర్పించారు సునీత తరఫు లాయర్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News