BigTV English
Advertisement

Infertility in Men : ఇన్‌ఫెర్టైల్ మగవారికి కూడా సంతానం కలిగే ఛాన్స్.. ఎలాగంటే..?

Infertility in Men : ఇన్‌ఫెర్టైల్ మగవారికి కూడా సంతానం కలిగే ఛాన్స్.. ఎలాగంటే..?
Close up of unrecognizable young father holding his newborn baby son in his arms

Infertility in Men : పిల్లలు పుట్టే విషయంలో ఆడవారికి కానీ, మగవారికి కానీ పలు సమస్యలు ఉండడం సహజం. ఒకప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వేరే పెళ్లి చేసుకోవడం తప్పా వేరే మార్గం ఉండేది కాదు. కానీ అవన్నీ పాతకాలం మాటలు. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్‌లో టెక్నాలజీ అనేది విపరీతంగా పెరగడంతో పిల్లలు పుట్టడం కోసం ఫెర్టిలిటీ సెంటర్స్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈ సమస్యను తీర్చడానికి శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు కొత్త పరిష్కారాలతో ముందుకొస్తున్నారు.


కొంతమంది మగవారు ఇన్‌ఫెర్టైల్‌గా ఉంటారు. అంటే వారికి సంతానం కలిగే అవకాశం ఉండదు. అలాంటి వారు పిల్లల గురించి ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఇన్‌ఫెర్టైల్ మగవారిలో కూడా ఫంక్షనల్ స్పెర్మ్ అనేది ఉంటుందని, దీనిపై పరిశోధనలు చేసి డెవలప్ చేస్తే.. ఇది పురుషుల ఇన్‌ఫెర్టిలిటీ చికిత్సా విధానాన్నే పూర్తిగా మార్చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా సంతానం విషయంలో కూడా వారు నిరాశపడాల్సిన అవసరం ఉండదన్నారు.

పురుషులలో ఇన్‌ఫెర్టిలిటీ అనేది వైద్యులు ఎక్కువగా దృష్టిపెట్టాల్సిన సమస్య. ఒకవేళ వారి సమస్య గురించి బయటపెట్టినా కూడా పరిష్కారం దొరకదేమో అన్న ఆలోచనతో చాలామంది పురుషులు దీని గురించి బయటపెట్టడానికి ఇష్టపడరు. ఆరు జంటలలో ఒకరు కచ్చితంగా ఇన్‌ఫెర్టిలిటీ సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారని స్టడీలో తేలింది. అంతే కాకుండా అమెరికాలోని 10 శాతం పురుషులు ఇన్‌ఫెర్టైల్ అని తెలిసింది. ఈ పరిస్థితి కారణమయ్యే కండీషన్‌ను నాన్ ఆబస్ట్రక్టివ్ అజూస్పెర్మియా (ఎన్ఓఏ) అంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


గత 50 ఏళ్లలో రీప్రొడక్షన్ విషయంలో టెక్నాలజీ ఎంతో సాయంగా నిలబడుతోంది. అంతే కాకుండా ముఖ్యంగా ఈ విషయంలో టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్ఓఏ ఉన్నవారికి పలు చికిత్సా పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నా.. అందులోని సక్సెస్ రేటు మాత్రం అందరికీ ఒకేలా ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే ఇన్‌ఫెర్టైల్ పురుషులలో కూడా గర్భానికి కారణమయ్యే స్పెర్మ్స్‌ను గుర్తించి ఆ కోణంలో పరిశోధనలు చేయాలని వారు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఆ పరిశోధనలకు కావాల్సిన సన్నాహాలు జరుగుతున్నాయని బయటపెట్టారు.

Tags

Related News

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×