Big Stories

Jupiter : జూపిటర్ గురించి ఆసక్తికర విషయాలు బయటికి..

- Advertisement -

Jupiter : గ్రహాల గురించి స్టడీ చేయడం ఆస్ట్రానాట్స్‌కు ఎంతో ఆసక్తికరమైన విషయమని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తేలింది. వారు కనిపెట్టిన ఎన్నో మిస్టరీలు.. గ్రహాల గురించి మనుషులు స్పష్టంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. వారి పరిశోధనల కారణంగానే సోలార్ సిస్టమ్ గురించి, గ్యాలక్సీల గురించి అవగాహన ఏర్పడింది. తాజాగా వారి పరిశోధలనల కారణంగా బృహస్పతి (జూపిటర్) గ్రహం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.

- Advertisement -

జూపిటర్ అనేది ప్రస్తుతం సూర్యుడికి కొన్ని లైట్ ఇయర్స్ దూరంగా ఉంటుంది. కానీ ఆ గ్రహం ఫార్మ్ అయినప్పుడు మాత్రం ఇది సూర్యుడికి చాలా దగ్గరగా ఉండేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెల్లగా దీని స్థానాన్ని ఇది మార్చుకుంటూ ప్రస్తుతం ఉన్న స్థానంలో ఫిక్స్ అయిపోయిందని అన్నారు. బిలియన్ల సంవత్సరాల క్రితం జూపిటర్ అనేది ఏర్పడినప్పుడు ఆకర్షణ శక్తుల వల్ల ఇది సోలార్ సిస్టమ్ మధ్యలో వచ్చి స్థిరపడిందని తేల్చారు. ముందుగా ఇది మార్స్ ఉన్న చోటులోనే ఉండేదని తెలిపారు.

మార్స్ ఉన్న స్థానం నుండి కదులుతూ వచ్చిన జూపిటర్ ముందుగా ఒక స్థానంలో స్థిరపడిందని, ఇప్పుడు ఆ స్థానంలో శాటర్న్ ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జూపిటర్ అనేది ప్రాంతాలు మారుతున్న క్రమంలో దీనికి ఉన్న ఆకర్షణ శక్తి వల్ల ఒక గ్రహశకలాలు సైతం స్థానాలు మారేవని, ఒక్కొక్కసారి రెండు గ్రహశకలాలు కలిసి విధ్వంసం సష్టించేవని తెలిపారు. ఇవన్నీ ఎన్నో మిలియన్ల ఏళ్ల క్రితం మాట అని అన్నారు. జూపిటర్ అనే ఈ గ్యాస్ ప్లానెట్ల వల్ల పలుమార్లు గ్రావిటేషనల్ ఫోర్స్‌పై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు.

అంటార్కిటికా, నార్త్ వెస్ట్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఇప్పటికీ కొన్ని గ్రహశకలాల ఆనవాళ్లు ఉంటాయి. ఇవి స్టడీ చేసినప్పుడు దాదాపు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం అంతరిక్షం నుండి భూమిపై పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు జూపిటర్ ఏర్పడిన సమయంలోనే అని వారు చెప్తున్నారు. అందుకే ఆ గ్రహశకలాల ఆనవాళ్లకు, జూపిటర్ గ్రహానికి ఏదో సంబంధం ఉండవచ్చనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News