E-Paper

IPhone 14 : రూ.52 వేలకే ఐఫోన్‌ 14

IPhone 14 : రూ.52 వేలకే ఐఫోన్‌ 14
Advertisement

IPhone 14 : ఆపిల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన ఐఫోన్ 14ను… 52 వేల రూపాయలకే చేజిక్కించుకునే సువర్ణావకాశం వచ్చింది. అయితే, ఐఫోన్ 14 ఈ రేటుకు రావాలంటే… మీ దగ్గర ప్రీమియం స్మార్ట్ ఫోన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండాలి. అప్పుడే మీరు ఐఫోన్ 14ను రూ.52 వేలకు సొంతం చేసుకోగలరు.

ఐఫోన్ లేటెస్ట్ మోడల్ విడుదలైన ప్రతిసారీ ఎక్కువ రేటు ఉండటంతో… చాలా మంది తగ్గే వరకు ఎదురుచూస్తుంటారు. అదే పాత ఐఫోన్లు ఉన్న వాళ్లు… దాన్ని ఎక్స్ఛేంజే చేసి కొత్త మోడల్ ఐఫోన్ తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్యే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14పై ఇప్పుడు అద్భుత ఆఫర్ ప్రకటించింది… ఫ్లిప్‌కార్ట్‌. దసరా, దీపావళి సీజన్ సందర్భంగా జరిగే బిగ్ బ్యాంగ్ సేల్ లోనూ ఇవ్వని తగ్గింపును… ఇప్పుడు ఐఫోన్ 14పై ఆఫర్ చేస్తోంది… ఫ్లిప్‌కార్ట్‌.

Advertisement

ఇప్పుడు ఐఫోన్‌ 14ను రూ. 51,900కే పొందవచ్చు. అంటే… అసలు ధర రూ.79,900 కన్నా రూ.28,000 తక్కువకు సొంతం చేసుకోవచ్చన్న మాట. ఐఫోన్ 14 128జీబీ మోడ‌ల్ ఎంఆర్‌పీ రూ.79,900 కాగా… ఫ్లిప్‌కార్ట్‌లో రూ.77,400కు ల‌భిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా కొంటే దానిపై రూ.5000 తగ్గింపు అదనం. అలాగే పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి… వినియోగదారులు రూ.20,500 వ‌ర‌కు త‌గ్గింపు పొందవచ్చు. అయితే, రూ.20,500 ఎక్స్ఛేంజ్ విలువ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఎక్స్ఛేంజ్ డీల్‌తో లేటెస్ట్ ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.51,900కు అందుబాటులో ఉంది. ఐ ఫోన్‌ 12Pro ద్వారా రూ.20 వేలు, ఐఫోన్‌ 11 ఇచ్చి రూ.15వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే శాంసంగ్‌ గెలాక్సీ S20 Ultra ఎక్స్ఛేంజ్ చేసి రూ.12,450, వన్‌ప్లస్‌ 7T ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.10,100 తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14నే కాదు… ఐఫోన్ 13ను కూడా త‌క్కువ ధ‌ర‌కే ఫ్లిప్‌కార్ట్‌లో సొంతం చేసుకోవచ్చు.

Tags

Related News

తెలంగాణలో మారిన వాతావరణం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!

హైదరాబాద్ భారీ వర్షం .. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Big Stories

×