E-Paper
Advertisement

Ragi for Diabetes: రాగులతో డయాబెటిస్ కంట్రోల్.. ఇలా తింటే బోలెడు బెనిఫిట్స్

Ragi for Diabetes: రాగులతో డయాబెటిస్ కంట్రోల్.. ఇలా తింటే బోలెడు బెనిఫిట్స్
Advertisement

Ragi for Diabetes డయాబెటిస్‌తో బాధపడే వారికి తినే ఆహారం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూనే.. శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహారాల కోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి అద్భుతమైన ఆహారాలలో ‘రాగి’ అగ్రస్థానంలో ఉంటుంది. పీచు పదార్థం, క్యాల్షియం ,తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన రాగులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరప్రసాదం అని చెప్పవచ్చు. రాగులు షుగర్ రోగులకు ఎందుకు మంచివో , వాటిని ఉపయోగించే 4 సులభమైన మార్గాలను తెలుసుకుందాం.

డయాబెటిస్‌లో రాగి ప్రాముఖ్యత:
రాగులలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇవి తిన్న తర్వాత రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇందులో ఉండే పాలిఫెనాల్స్ , డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది గోధుమలు లేదా బియ్యం కంటే మెరుగైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

Advertisement

రాగులను ఉపయోగించే 4 సులభమైన మార్గాలు:

1. రాగి జావ :
రాగి జావ అనేది అత్యంత ప్రాచుర్యం పొందిన, సులభమైన పద్ధతి. రాగి పిండిని నీటిలో కలిపి, ఉడికించి అందులో మజ్జిగ, కొద్దిగా ఉప్పు , జీలకర్ర పొడి కలుపుకుని తాగాలి.

Advertisement

చిట్కా: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇందులో బెల్లం లేదా చక్కెర వేయకూడదు. మజ్జిగ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది.

2. రాగి రోటీ లేదా చపాతీ:
కేవలం గోధుమ పిండితో చపాతీలు చేసుకునే బదులు, అందులో రాగి పిండిని కలిపి రొట్టెలు చేసుకోవచ్చు.

తయారీ: ఒక కప్పు రాగి పిండికి కొద్దిగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు , వేడి నీటిని కలిపి రొట్టెల్లా చేసుకోవాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు. తద్వారా చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

3. రాగి ఇడ్లీ లేదా దోశ:
సాధారణంగా ఇడ్లీ, దోశల్లో బియ్యం ఎక్కువగా వాడతారు. ఇది షుగర్ ఉన్నవారికి అంత మంచిది కాదు. బియ్యానికి బదులుగా రాగులను వాడి ఇడ్లీ లేదా దోశలు తయారు చేసుకోవచ్చు.

తయారీ: రాగులు , మినపప్పును సమాన పాళ్ళలో నానబెట్టి రుబ్బి పులియబెట్టాలి. ఈ దోశలు ప్రోటీన్ , ఫైబర్‌కు మంచి మూలం.

4. రాగి ఉప్మా లేదా కిచిడీ:
రవ్వకు బదులుగా రాగి నూకను లేదా రాగి పిండిని కూరగాయలతో కలిపి ఉప్మాగా చేసుకోవచ్చు. ఇందులో క్యారెట్, బీన్స్, బఠానీలు వంటి కూరగాయలు చేర్చడం వల్ల పోషక విలువలు పెరుగుతాయి. ఇది బ్రేక్ ఫాస్ట్ లేదా రాత్రి భోజనానికి బెస్ట్ ఆప్షన్.

Also Read: ఈ టిప్స్ ఫాలో అయితే.. కంటి సమస్యలు జన్మలో రావు తెలుసా ?

రాగుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

క్యాల్షియం: ఎముకల బలానికి రాగులు చాలా అవసరం.

బరువు తగ్గడం: ఇందులో ఉండే ‘ట్రిప్టోఫాన్’ ఆకలిని తగ్గిస్తుంది. ఇది బరువు పెరగకుండా చూస్తుంది.

మెగ్నీషియం: గుండె ఆరోగ్యానికి , ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి మెగ్నీషియం సహాయ పడుతుంది.

రాగి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక అద్భుతమైన ఆహారం అనడంలో సందేహం లేదు. అయితే.. అతిగా ఏదీ మంచిది కాదు. మీ డైట్‌లో రాగులను చేర్చుకునే ముందు మీ రక్తంలో చక్కెర స్థాయిలను గమనిస్తూ ఉండటం డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం. సరైన వ్యాయామంతో పాటు ఈ రాగి వంటకాలను తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×