BigTV English

Island at a lower price:- విల్లా కంటే తక్కువ ధరకే ఐలాండ్.. కొంటారా?

Island at a lower price:- విల్లా కంటే తక్కువ ధరకే ఐలాండ్.. కొంటారా?

Island at a lower price:- దేశంలోని ప్రధాన నగరాల్లో భూములు, ఇళ్ల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఓ విల్లా కావాలంటే తక్కువలో తక్కువ 5 కోట్ల రూపాయలైనా కుమ్మరించాల్సిందే. ఇక ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల అయితే… ఆ రేటుకు ఓ అపార్టుమెంట్లో ఫ్లాట్ దొరకడం కూడా కష్టమే. మన మహానగరాల్లో ఫ్లాట్, విల్లా కంటే తక్కువ ధరలో… ఓ చోట ఏకంగా ద్వీపమే అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న కోటీశ్వరులెవరైనా ఉంటే… దాని కోసం ట్రై చేయొచ్చు. అయితే, అది మన దేశంలో కాదు.


మధ్య అమెరికాలోని నికరాగువా దేశంలో… బ్లూఫీల్డ్స్ అనే ప్రాంతం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఇగువానా ఐలాండ్‌ ఉంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో… కొబ్బరి, అరటి చెట్ల మధ్య ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇందులో హాల్‌, కిచెన్‌, బార్‌, లివింగ్‌ ఏరియాతో పాటు… పనివాళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని గదులు కూడా ఉన్నాయి. ఇంటి బయట స్విమ్మింగ్‌ పూల్‌, ఫిష్‌ డాక్‌ను నిర్మించారు. ద్వీపం చుట్టూ ఉన్న ప్రకృతి ఆందాలను చూసేందుకు… 28 అడుగుల ఎత్తు ఉన్న వాచ్‌ టవర్ కూడా ఉంది. వైఫై, టీవీ, ఫోన్ వంటి సౌకర్యాలు కూడా ఈ విలాసవంతమైన భవనంలో ఉన్నాయి. ఈ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటే… ప్రైవేట్ ఐలాండ్‌ ఆన్‌లైన్‌ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి… నికరాగువా ప్రాంతంపై క్లిక్ చేస్తే ఇగువానా ఐలాండ్‌ వివరాలు కనిపిస్తాయి.

వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఈ ద్వీపం ధర కేవలం 4,75,000 డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో దాదాపు 3 కోట్ల 90 లక్షలు. పోనీ… అన్నీ కలిపి ఐదెకరాల ఐలాండ్ కాస్ట్ 4 కోట్లు అనుకున్నా… ఎకరా కేవలం 80 లక్షలకే వస్తుంది. ఈ ధర మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూముల రేట్ల కన్నా చాలా చీప్. ప్రస్తుతం ఈ ద్వీపాన్ని ఇంకా ఎవరూ కొనలేదు. ఆసక్తి ఉంటే… ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొని దాన్ని సొంతం చేసుకోవచ్చు.


Follow this link for more updates:- Bigtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×