E-Paper
Advertisement

Ants : ఎలాంటి చీమలు ఇంట్లోకి వస్తే మంచిది…?

Ants : ఎలాంటి చీమలు ఇంట్లోకి వస్తే మంచిది…?
Advertisement

Ants : ఇంట్లో రకరకాల చీమలు వస్తుంటాయి. అందులో మూడు రకాలుంటాయి. నల్ల చీమలు చిన్నవి, గండు చీమలు, ఎర చీమలు ఇళ్లలోకి వస్తుంటాయి. ఇంట్లో ఎక్కడైనా తీపి పదార్ధాలు పడేస్తే చీమలు రావడం సహజం అందులో మరో రకంగా ఆలోచించాల్సిన పనిలేదు. అలా తీపిని వెతుక్కుంటూ వచ్చే చీమలు ఆహారం కోసం వచ్చి వెళ్లిపోతుంటాయి. కొన్నిసార్లు ఎలాంటి తీపి పదార్ధాలు పడేయకపోయినా ఇంట్లోకి చీమలు వస్తుంటాయి. అప్పుడు ఆ చీమలు దేనికి సంకేతం తెలుసుకోండి.

ప్రకృతి అంటే అమ్మవారు . ఇంట్లో మనం మాట్లాటేడప్పుడు బల్లి అరిస్తే సత్యం అంటారు. అలాగే కలల రూపంలో మనకి కొన్ని కనిపిస్తుంటాయి. ఇవ్వన్నిఅమ్మవారు మనకిచ్చే సంకేతాలన్న మాట. అందులో భాగమే ఈ చీమలు. ఇంట్లోకి చిన్న నల్ల చీమలు రావడం శుభకరం. వాటినే చలిచీమలు అని కూడాఅంటారు. అలాంటి వాటికి చక్కెర వేస్తే శనిదోషం పోతుందంటారు. గండు చీమలు, ఎర్ర చీమలు ఇంట్లోకి వచ్చే దిశను బట్టి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి ఉత్తరానికి ఈశాన్యానికి మధ్య భాగం నుంచి ఎర్ర చీమలు వస్తుంటే అనారోగ్యానికి సంకేతం. తూర్పు మధ్య నుంచి గండుచీమలు కానీ ఎర్ర చీమలు వస్తున్నాయంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తగదాలు వస్తాయని సంకేతం. సామాజికపరంగా కూడా ఇవన్నీ వస్తాయి. అదే స్థానం నుంచి నల్ల చీమలు వస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతకు సంకేతం.

Advertisement

ఇంటి దక్షిణం నుంచి సమస్య కనిపిస్తుంటే ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన నష్టం జరగబోతుందని భావించాలి.నైరుతి నుంచి చీమలు వస్తుంటే భార్యా, భర్తల మధ్య గొడవలకి సంకేతం.

ఆగ్నేయ నుంచి ఎర్రచీమలు వస్తుంటే వివాహ జీవితంలో సమస్యలు రాబోతున్నాయనడానికి సూచికగా భావించాలి. ఇది జరగబోతుందని చెప్పడానికి ముందుగా అమ్మవారు చీమల రూపంలో సంకేతమిస్తుంటారు. మహాభారతంలో కౌరవుల ఓటమికి ముందే సంకేతాలు కనిపిచాయట. ఆకాశంలో నక్షత్రాలు అన్నీ ఒక వైపుకు వెళ్లిపోయాయట. అగ్ని ఒక్కసారిగా పైకి ఎగిసిపడటం, పక్షుల అరుపులు ఇలాంటివన్నీ ప్రకృతిలో జరగపోయే మార్పులకు సంకేతంగానే భావించాలి. అలాగే ఇంట్లో జరిగే మార్పులనీ ప్రకృతి మనకు ముందుగా ఏదో రూపంలో సూచాయిగా చెబుతుంది..

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×