Iran Two Ship Seized: ఇరాన్-అమెరికా మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో యూఎస్ సీజ్ ఫైర్ మరోసారి పొడింగింది. అయితే హార్మూజ్ జలసంధిలో మాత్రం టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. హార్మూజ్ ను అటు ఇరాన్, ఇటు అమెరికా దిగ్బంధించాయి. తాజాగా రెండు నౌకలను ఇరాన్ సీజ్ చేసింది. వీటిల్లో ఒకటి ఇండియాలోని గుజరాత్ వస్తున్న సరకు నౌక కావడం విశేషం.
హార్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న రెండు నౌకలను సీజ్ చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ బుధవారం తెలిపింది. మెరైన్ ట్రాఫిక్ షిప్పింగ్ డేటా ప్రకారం, లైబ్రేరియన్ జెండాతో ఉన్న ‘ఎపామినోండాస్’ అనే కంటైనర్ నౌక భారత్ లోని గుజరాత్‌కు వస్తుంది. హార్మూజ్ జలసంధిలో నిబంధనలను ఉల్లంఘించిన రెండు నౌకలను ఐఆర్జీసీ నేవీ నిలిపివేసింది. ఆ రెండు నౌకలను IRGC నౌకాదళం సీజ్ చేసి ఇరాన్ తీరానికి తరలించిందని అని ఒక ప్రకటన నేవీ అధికారులు తెలిపారు. శ్రీలంకలోని హంబంటోటాకు వెళ్తోన్న MSC-FRANCESCA అనే పనామా జెండా గల కంటైనర్ షిప్‌ను రెండో నౌకగా తెలుస్తోంది.
హార్మూజ్ జలసంధి గుండా భారత్ వైపు వస్తోన్న రెండు కంటైనర్ నౌకలను ఐఆర్జీసీ నేవీ కమాండ్ సీజ్ చేసింది. ఆ రెండు నౌకలు అనుమతులు లేకుండా హార్మూజ్ ను దాటేందుకు ప్రయత్నిస్తున్నాయని, నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేయడంతో సముద్ర భద్రతకు ముప్పు కలిగించాయని ఐఆర్‌జీసీ పేర్కొంది. ఈ కారణాలతో MSC-FRANCESCA, EPAMINODES అనే రెండు నౌకలను ఐఆర్జీసీ స్వాధీనం చేసుకుందని ప్రకటించింది.
హార్మూజ్ జలసంధిలో రాకపోకలకు సంబంధించి ఇరాన్ నిబంధనలు ప్రకటించింది. ఈ నిబంధనల అమలుకు ఆటంకం కలిగించేందుకు చర్యలను, జలమార్గంలో సురక్షిత ప్రయాణానికి విరుద్ధంగా జరిగే కార్యకలాపాలను ఐఆర్‌జీసీ నేవీ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లఘించిన వారిపై చట్టపరంగా, కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.
Also Read: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు! ఈసారి జెనీవా వేదికగా, వీలైతే ఈ వారంలో భేటీ!
భారత్ వైపు వస్తున్న ‘ఎపామినోండాస్’… లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ షిప్. ఈ నౌక యూఏఈలోని దుబాయ్ జెబెల్ అలీ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వెళ్తుంది. మెరైన్‌ట్రాఫిక్ సమాచారం ప్రకారం, ఈ నౌక మొత్తం పొడవు 299.9 మీటర్లు, వెడల్పు 42.8 మీటర్లుగా తెలుస్తోంది.
ఇరాన్-అమెరికా చర్చలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే, అమెరికా ఇరాన్ ఓడరేవులపై నేవీ దిగ్బంధనాన్ని కొనసాగించింది. ఇరాన్ సైతం హార్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది.