BigTV English

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇంట విషాదం… అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇంట విషాదం… అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Janhvi Kapoor: బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి నిర్మల్ కపూర్ (90) కన్నుమూశారు. ఆమె వృద్ధాప్య సమస్యలతో ముంబైలో కోకిల బెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ లో చేరారు. ఆమె ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్, నటుడు సంజయ్ కపూర్, అనిల్ కపూర్, వీణ కపూర్ ఆమె సంతానం. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు.


ఈ వార్త తెలుసుకున్నవెంటనే శ్రీదేవి భర్త బోనికపూర్ ఆయన కుమార్తెలు జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ ముంబైలో కడువాలలోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు.వాళ్ళ నానమ్మ మరణం తో జాన్వీ కపూర్ ఇంట్లో విషాదం నెలకొంది.రేపు ఉదయం 11:30 గంటలకు పవన్ హన్స్ స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

కపూర్ ఫామిలీ …హాస్పటల్ కు చేరుకున్నారు ..


నిర్మల్ కపూర్ ప్రముఖ నిర్మాత సుందర్ కపూర్ ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి అనిల్ కపూర్, బోనీకపూర్, సంజయ్ కపూర్, సంతానం. అంతేకాకుండా ఆమెకు అర్జున్ కపూర్, సోనం కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్, జాన్వి కపూర్, ఖుషి కపూర్,అన్షులా కపూర్, మోహిత్ మార్వా, అనే మనవళ్లు మనవరాలు ఉన్నారు.  కొన్ని నెలలుగా ఆమె వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కపూర్ కుటుంబమంతా కోకిల ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ కు చేరుకున్నారు.

తల్లి మరణా వార్తతో ముగ్గురు అన్నదమ్ముల ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. బోనీకపూర్, సంజయ్ కపూర్ అనిల్ కపూర్ వారి తల్లి మరణ వార్తతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె 90వ పుట్టినరోజును గత సంవత్సరం అనిల్ కపూర్ ఇంట ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకలకు కపూర్ ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. బోనీకపూర్ శ్రీదేవి ల కుమార్తె జాహ్నవి కపూర్ తన నానమ్మతో ప్రత్యేక అనుబంధం ఉంది. జాన్వి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు.జాన్వీ సోహాల్ మీడియా వేదికగా తన నాన్నమ్మ తో వున్నా ఫోటోలను పంచుకుంది. ఆమె ఇక లేరని తెలిసి నివాళు అర్పించేందుకు బాలీవుడ్ నుండి ప్రముఖులు అనిల్ కపూర్ నివాసానికి చేరుకున్నారు.

సినీ రంగం లో కపూర్ ఫామిలీ …సుస్థిర స్థానం ..

నిర్మల్ కపూర్ సంతానంలో బోనీకపూర్,అనిల్ కపూర్ సంజయ్ కపూర్ సినీ రంగంలో ప్రముఖులుగా స్థిరపడ్డారు. ఆమె మన వాళ్ళు మనవళ్ళు నిర్మల్ కపూర్ అర్జున్ కపూర్ సోనం కపూర్ రియా కపూర్ హర్షవర్ధన్ కపూర్ జాహ్నవి కపూర్ ఖుషి కపూర్ సినీ రంగంలో అడుగు పెట్టారు. సోనం కపూర్ కి తన నానమ్మతో అనుబంధం ఉంది. ఆమె 91 పుట్టినరోజున సోనం కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీ 90 బడే దాది లవ్ యు అని పోస్ట్ చేశారు.ఇక ఆమె లేరని తెలిసి కపూర్ కుటుంబం శోక సంద్రం లో మునిగిపోయింది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×