BigTV English

Love Marriage: జపాన్ భామ.. తెలుగబ్బాయి.. భద్రాద్రిలో బాజా భజంత్రీలు..

Love Marriage: జపాన్ భామ.. తెలుగబ్బాయి.. భద్రాద్రిలో బాజా భజంత్రీలు..

Love Marriage: హైదరాబాద్ కుర్రాడు. జాబ్ కోసం జపాన్ వెళ్లాడు. ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కొలువు. బుద్ధిగా ఉద్యోగం చేసుకోవచ్చుగా. కంపెనీలోనే హెచ్‌ఆర్ మేనేజర్‌గా పని చేసే జపాన్ పిల్లను లైన్లో పెట్టాడు. మనోడి టాలెంట్‌కి ఈజీగా పడిపోయింది. కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. మరి, పెళ్లి..? ఇక్కడే వచ్చింది సమస్య. అతనేమో ఇండియన్. ఆమేమో జపనీస్. కులం, మతం, దేశం, జాతి.. అంతా వేరువేరు. అయితేనేం.. ప్రేమ యూనివర్సల్ కదా. అందుకే, వారి ప్రేమ ముందు ఇవేవీ అడ్డు రాలేదు. ఆఖరికి ప్రేమకు మెయిన్ విలన్లు అయిన పెద్దోళ్లు కూడా అడ్డు చెప్పలేదు. ఇద్దరి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.


“ఆకాష్ వెడ్స్ మీకెలా”. మరి, పెళ్లి ఎలా? జపాన్ స్టైల్లోనా? హిందూ సంప్రదాయమా? మనోడే వరుడు కాబట్టి.. మన స్టైల్లోనే పెళ్లికి ఆ జపాన్ పిల్ల ఓకే అంది. ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చారు. భద్రాద్రి రామాలయంలో పెళ్లి చేసుకున్నారు.

ఆ వెడ్డింగ్ వీడియో చూసి తీరాల్సిందే. జపాన్ అమ్మాయే అయినా.. చక్కదనాల తెలుగమ్మాయిలా ముస్తాబైంది. అచ్చమైన తెలుగు పెళ్లికూతురిలా చీరకట్టు, బొట్టు, అలంకరణతో మెరిసిపోయింది. ముఖమొక్కటే జపాన్. మిగతాదంతా తెలుగుతనం.


ఆమె తరఫున పేరెంట్స్, కొందరు సన్నిహితులు వచ్చేశారు. అబ్బాయి కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. పెళ్లి తంతును చక్కగా ఫాలో అయింది ఆ జపాన్ వధువు. పెళ్లి వేడుక అదుర్స్.

మనసైడ్ పెళ్లి తంతు చూసి మీకెలా ఫుల్ హ్యాపీ. ఇదంతా కొత్తగా అనిపించిందామెకు. చాలా బాగుందని సంబరపడింది కూడా.

ఇటీవల కాలంలో ఇక్కడివాళ్లే ఏదో తూతూమంత్రంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. జపాన్ వధువు మాత్రం ఎంతో ఆసక్తిగా, పద్దతిగా హిందూ పద్దతిలో వివాహం చేసుకోవడం అభినందించాల్సిందే.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×