BigTV English

Vishwak Sen: నితిన్ రిజెక్ట్ చేసిన కథను ఓకే చేసిన విశ్వక్.. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్..!

Vishwak Sen: నితిన్ రిజెక్ట్ చేసిన కథను ఓకే చేసిన విశ్వక్.. ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్..!

Vishwak Sen and director Krishna Chaitanya: నటుడు విశ్వక్ సేన్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వెళ్లిపోమాకే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విశ్వక్.. ఆ తర్వాత ఫలక్‌నుమా దాస్ సినిమాతో హీరో కమ్ దర్శకుడిగా మంచి స్టార్డమ్ అందుకున్నాడు. అలా ఓ వైపు హీరోగా మరోవైపు దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ‘గామి’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.


ఎప్పుడో ఆరేళ్ల క్రితం పట్టాలెక్కిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఈ ఏడాది రిలీజ్‌కు నోచుకుంది. అయితే ఇన్నేళ్లు మూవీ టీం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అందుకుంది. కలెక్షన్లలో కూడా దుమ్ము దులిపేసింది. ఈ సినిమా సక్సెస్‌తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదనే చెప్పాలి.

ఎందుకంటే ఈ సినిమా స్టోరీ చాలా చక చకా అయిపోతుంది. ఒక ఊరిలో ఎలాంటి పని చేయని వాడు ఎమ్మెల్యే దగ్గర పనోడిగా చేరడం.. ఆ తర్వాత ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్‌గా ఉండటం.. ఆపై తానే ఆ ఎమ్మెల్యేకి పోటీగా నిలబడి గెలవడం.. ఇలా ప్రతి సన్నివేశం చాలా తొందర తొందరగా జరిగిపోతుంది. దీని కారణంగానే చాలా మందికి ఎక్కలేదనే టాక్ ఆ మధ్య నడిచింది. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.


Also Read:  ‘జాతి రత్నాలు’ డైరెక్టర్‌తో విశ్వక్ కొత్త సినిమా.. కామెడీ ఎట్లుంటదో మరి..!

ఇక విజయపజయాలతో సంబంధం లేకుండా విశ్వక్ మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అవి ఒకటి లైలా, మరొకటి మెకానిక్ రాఖీ. ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ఫ్లాప్ అందించిన దర్శకుడు కృష్ణ చైతన్యకే మరోసారి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పీపుల్స్ మీడియా నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. మొదటిగా కృష్ణ చైతన్య తన కథను హీరో నితిన్‌కు వినిపించాడు. అయితే దానికి నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఫ్లాప్ కావడంతో నితిన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అందువల్లనే పీపుల్స్ మీడియా నిర్మాతలు ఈ కథలో కొన్ని ఛేంజెస్ చేసి మళ్లీ విశ్వక్ దగ్గరకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ కథను విశ్వక్‌కు వినిపించడం.. అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతా చక చకా జరిగిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి ‘పవర్ పేట’ అనే టైటిల్‌ను కూడా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×