BigTV English

James Anderson Retirement: జేమ్స్ ఆండర్ సన్ రిటైర్మెంట్.. సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ రియాక్షన్

ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇటీవల లార్డ్స్ మైదానంలో వెస్ట్ ఇండీస్ తో ఇంగ్లాండ్ జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఆడిన తరువాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఆండర్సన్ ఇప్పటికే టి20, వన్ డే క్రికెట్ ఫార్మాట్ నుంచి సన్యాసం తీసుకున్నారు. ఆయన రిటైర్మెంట్ పై చాలా మంది సెలెబ్రిటీస్, క్రికెటర్స్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ క్రమంలోనే  ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ కూడా ఒక ఎమోషనల్ మెసేజ్ చేశారు.

James Anderson Retirement: జేమ్స్ ఆండర్ సన్ రిటైర్మెంట్.. సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ రియాక్షన్

James Anderson Retirement news(Sports news in telugu): ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇటీవల లార్డ్స్ మైదానంలో వెస్ట్ ఇండీస్ తో ఇంగ్లాండ్ జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఆడిన తరువాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఆండర్సన్ ఇప్పటికే టి20, వన్ డే క్రికెట్ ఫార్మాట్ నుంచి సన్యాసం తీసుకున్నారు. ఆయన రిటైర్మెంట్ పై చాలా మంది సెలెబ్రిటీస్, క్రికెటర్స్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ క్రమంలోనే  ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ కూడా ఒక ఎమోషనల్ మెసేజ్ చేశారు.


Also Read:   శుభ్ మన్ గిల్ కు ఏమైంది?.. జింబాబ్వే సిరీస్ లో మరి ఇలాగా?

ట్విట్టర్-X లో జేమ్స్ ఆండర్సన్ గురించి సచిన్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. “జిమ్మీ(జేమ్స్ ఆండర్సన్) తన అద్భుతమైన 22 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సార్లు తన బౌలింగ్‌తో క్రికెట్ ప్రేమికులని మంత్రముగ్ధులని చేశాడు. జిమ్మీ బౌలింగ్ చేస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. బౌలింగ్ లో స్పీడ్, డైరెక్షన్, టైమింగ్, స్వింగ్ ఏదీ మిస్ కాకుండా అద్భుతమైన ఫిట్ నెస్‌తో ఆయన ఆటతీరు ఉండేది. జిమ్మీ బౌలింగ్ రాబోయే తరాలు పాఠాలుగా చెప్పుకుంటాయి. జిమ్మీకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, సంతోషకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. జిమ్మీ ఇక మీరు మీ కుటుంబంతో మీ విలువైన సమయాన్ని గడపుతూ కొత్త జీవితం ప్రారంభించండి.” అని సచిన్ రాశారు.


సచిన్ తరువాత ఇండియన్ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా కూడా జేమ్స్ ఆండర్సన్‌ గురించి రాశారు.

– “జిమ్మీ మీ కెరీర్ ఎంతో అద్భుతంగా సాగింది. మీరు సాధించిన రికార్డులు చిరకాలం నిలిచిపోతాయి. ఒక ఫాస్ట్ బౌలర్ మీరు సాధించిన 704 టెస్టు వికెట్ల రికార్డుని బ్రేక్ లేరనిపిస్తుంది. అది కూడా 188 టెస్టు మ్యాచ్ లు ఆడడం సామాన్యులకు సాధ్యం కాదు. మీ అద్భుతమైన కెరీర్ ముగింపుకి మరోసారి శుభాకాంక్షలు.” అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

– “ఫాస్ట్ బౌలింగ్ లో బాల్ ని రెండు విధాలుగా స్వింగ్ చేయగలగడం అందరికీ సాధ్యం కాదు. అది కూడా పర్ఫెక్ట్ టైమింగ్ తో.. మీ కష్టపడేతత్వమే మిమ్మల్ని గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది. అని యువరాజ్ సింగ్ ట్విట్టర్” లో రాశారు.

– “బౌలింగ్ లో ఒక శకం ముగిసింది. జిమ్మీ మీ అద్భుత కెరీర్ ముగింపుపై మీకు నా శుభాకాంక్షలు. క్రికెట్ లో మీ ఏకాగ్రత, నైపుణ్యం నిజంగా అందరికీ ఆదర్శప్రాయం. మీ కొత్త జీవిత ప్రారంభానికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు,” అని సురేష్ రైనా ట్విట్టర్ లో పోస్టు చేశారు.

 

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×