BigTV English

Adani:అదానీని దాటిన అమెజాన్ అధిపతి

Adani:అదానీని దాటిన అమెజాన్ అధిపతి

Adani:ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకారు. మూడో స్థానంలో ఉన్న భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని వెనక్కి నెట్టిన బెజోస్… 3వ స్థానానికి చేరుకున్నారు. అయితే, ఇద్దరి మధ్య ఆస్తి తేడా కేవలం 1 బిలియన్ డాలర్లే కావడం విశేషం.


బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రకారం… గత 24 గంటల్లో అదానీ నికర ఆస్తి విలువ 872 మిలియన్ డాలర్లు తగ్గిపోయి… 120 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో జెఫ్ బెజోస్ సంపద 24 గంటల్లో 318 మిలియన్ డాలర్లు పెరిగి 121 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక గత ఏడాది ఇదే రోజు నుంచి ఇప్పటిదాకా గౌతమ్ అదానీ 683 మిలియన్ డాలర్ల సంపదను పోగొట్టుకోగా… జెఫ్ బెజోస్ 13.8 బిలియన్ డాలర్ల సంపను పోగేసుకున్నారు.

ఇక కుబేరుల జాబితాలో ఫ్రాన్స్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ 188 బిలియన్‌ డాలర్ల సంపదతో టాప్‌ పొజిషన్లో ఉన్నారు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 145 బిలియన్‌ డాలర్లతో నికర విలువతో రెండో స్థానంలో ఉండగా, 121 బిలియన్‌ డాలర్లతో బెజోస్ 3వ స్థానంలో, అదానీ 4వ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత 111 బిలియన్ డాలర్ల సంపదంతో 5వ స్థానంలో బిల్ గేట్స్, 108 బిలియన్ డాలర్ల సంపదంతో 6వ స్థానంలో వారెన్ బఫెట్, 99.5 బిలియన్ డాలర్ల సంపదతో 7వ స్థానంలో ల్యారీ ఎల్లిసన్ ఉన్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ 84.7 బిలియన్‌ డాలర్ల సంపదతో కుబేరుల జాబితాలో 12వ స్థానంలో నిలిచారు. ఏడాది వ్యవధిలో 2.38 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయిన ముఖేష్… 9వ స్థానం నుంచి 12వ స్థానానికి పరిమితమయ్యారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×