BigTV English

Airports Authority of India : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. పోస్టులు ఎన్ని అంటే?

Airports Authority of India : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. పోస్టులు ఎన్ని అంటే?

Airports Authority of India : న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ.. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 596 ఖాళీలున్నాయి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో ఈ పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.


ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌/ ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో 60% మార్కులతో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయస్సు 2023 జనవరి 1 నాటికి 27 సంవత్సరాలు మించరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది. గేట్‌ 2020/ గేట్‌ 2021/ గేట్‌ 2022 స్కోరు ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

మొత్తం ఖాళీలు: 596
జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్‌- సివిల్‌): 62 పోస్టులు
జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్‌- ఎలక్ట్రికల్‌): 84 పోస్టులు
జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రానిక్స్‌): 440 పోస్టులు
జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆర్కిటెక్చర్‌): 10 పోస్టులు


అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్‌(సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌/ ఆర్కిటెక్చర్‌)
వయసు: 21/01/2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది
వేతన శ్రేణి: రూ.40,000-1,40,000
ఎంపిక: గేట్‌ 2020/ గేట్‌ 2021/ గేట్‌ 2022 స్కోరు ఆధారంగా
దరఖాస్తు రుసుం: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు)
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 22/12/2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు సమర్పణకు చివరి తేదీ: 21/01/2023
వెబ్‌సైట్‌: https://www.aai.aero/

Tags

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×