Big Stories

Jyotirlinga Darshan : జ్యోతిర్లింగ దర్శనాలు జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలా…?

Jyotirlinga Darshan : కార్తీకమాసంలో జ్యోతిర్లింగాల దర్శనం పుణ్య ఫలితాన్ని చేకూరుస్తుంది.12 జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా , పూజించినా, తలచినా ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.

  1. సౌరాష్ట్ర సోమనాథుడ్ని దర్శించుకుంటే భోగ భాగ్యాలు కలుగుతాయి.
  2. శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకంటే సర్వ దరిద్రాలు సమసిపోతాయి.
    3.ఉజ్జయిని మహాకాలుడ్ని కొలిస్తే సర్వభయ, పాపాలు తొలగిపోతాయి.భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం పొందుతారు .
    4.ఓం కారేశ్వరుడ్ని పూజించడం వల్ల ఇంటా, బయటా అన్ని అన్ని సిద్ధిస్తాయని సౌఖ్యాన్ని ఇస్తాయని
  3. పరళి వైద్యనాథ లింగాన్ని సేవిస్తే అనేక దీర్ఘవ్యాధులు నయమవుతాయి.
  4. భీమేశ్వర లింగాన్ని దర్శించుకుంటే శత్రు జయం కలిగి అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. తప్పిపోతాయి.
    7.రామేశ్వరంలో రామలింగేశ్వరుడ్ని దర్శించి కాశీలో గంగా జలాన్ని అభిషేకిస్తే మహోన్నతమైన పుణ్యఫలం పరమపదాన్ని చేరతారు.
  5. ద్వారకా నాగేశ్వరుడ్ని దర్శించుకున్న మహాపాతకాలు, ఉపపాతకాలు నశిస్తాయి.
  6. కాశీ విశ్వేశ్వర లింగాన్ని సేవిస్తే సమస్త కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది.
  7. నాసిక్ త్రయంబకేశ్వరుడ్నికొలిస్తే కోరికలు తీరుతాయి. అపవాదులు పోతాయి.
    11.హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శిస్తే ముక్తిని పొందుతారు.
  8. ఘృశ్వేశ్వర లింగాన్ని దర్శించుకుంటే ఇహపర భోగాలు ప్రాప్తిస్తాయి.
    ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది.
    పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలమాట.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News