E-Paper
Advertisement

Kerala Ring : కేరళలో ఆ ఉంగారానికి డిమాండ్ ఎక్కువ

Kerala Ring : కేరళలో ఆ ఉంగారానికి డిమాండ్ ఎక్కువ
Advertisement

Kerala Ring : ఉంగరాలను కొందరు తమ రాశులను బట్టి ధరిస్తుంటారు. మరికొందరు అలంకరణ కోసం పెట్టుకుంటారు.. నవరత్నాల ఉంగరంతో పాటు పలు రకాలు ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి. కేరళలోని పయ్యనూర్‌ పవిత్రమొతిరం అనే ఉంగరాన్ని ధరిస్తే అన్నీ శుభాలే కలుగుతాయని అక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం.క న్నూర్‌ జిల్లా పయ్యనూర్‌లో శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం ఉంది. తొలినాళ్లలో దర్భతో వీటిని తయారుచేసేవారు. ఆలయ నిర్మాణ సమయంలో స్వామి ఆశీస్సులతో బంగారంతో తయారుచేయాలని స్థానిక బంగారు పనివారిని పురోహితుడు కోరాడు. దీంతో పవిత్రమైన దర్భ ఆకారంతోనే వీటిని తయారుచేయడంతో పవిత్రత చేకూరింది.

పయ్యనూర్‌లోని కొన్ని కుటుంబాల వారు మాత్రమే సంప్రదాయంగా వీటిని తయారుచేస్తుంటారు. ఒక్కో ఉంగరం తయారీకి మూడు రోజుల నుంచి వారం రోజులు పడుతుంది.. సంప్రదాయరీతిలో వీటిని తయారుచేయాలి. ఇందులో ఉండే మూడు గీతలు మానవ శరీరంలోని ఇద, పింగళ, సుషున్మ అనే నాడులకు ప్రతీకగా నిలుస్తాయి. వీటి తయారీలో ఉండేవారు జీవితాంతం మాంసం, మద్యం ముట్టకూడదు.

Advertisement

ఈ ఉంగరాన్ని ధరిస్తే మనిషి శరీరంలోని కుండలినీ శక్తికి శక్తిమంతంగా మారుతుందని పండితులు చెబుతారు. త్రిమూర్తులైన బ్రహ్మ, శివ, విష్ణువుల అనుగ్రహం కలుగుతుందట.పురాతన భారతీయ యోగా జ్ఞానం ప్రకారం, మానవ శరీరంలో శక్తి యొక్క మూడు నదులు ఉన్నాయి మరియు ఈ నదుల సజావుగా ప్రవహించడం వల్ల వ్యక్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది. శరీరం యొక్క కుడి వైపున పింగళ సౌర శక్తిని సూచిస్తుంది.వెన్నెముక తీగ యొక్క ఎడమ వైపున ఉన్న ఇడా చంద్రుని శక్తిని సూచిస్తుంది. మధ్యలో సుషుమా విశ్వ శక్తిని సూచిస్తుంది. కుండలిని శక్తి ఈ మూడు నదుల దిగువన ఉంది . మానవ శరీరంలో శక్తివంతమైన భావోద్వేగాలను ఇది రేకెత్తిస్తుంది. రింగ్ దాని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా దైవిక శక్తులను రేకెత్తిస్తుందని భారతీయులు నమ్ముతారు. ఇది కుడి చేతి యొక్క ఉంగరపు వేలుపై మాత్రమే ధరించవచ్చు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×