BigTV English

Mohammed Shami:షమీ భార్యకు భరణం… నెలకు ఎంతంటే?

Mohammed Shami:షమీ భార్యకు భరణం… నెలకు ఎంతంటే?

Mohammed Shami:టీమిండియా పేసర్ మహ్మద్ షమి… తన భార్య హసీన్ జహాన్‌కు నెల నెలా లక్షా 30 వేల రూపాయల భరణం ఇవ్వాలని కోల్‌కతా కోర్టు ఆదేశించింది. తనకు షమి నుంచి నెలకు రూ.10 లక్షల భరణం కావాలని… అందులో తన అవసరాలకు రూ.7 లక్షలు వాడుకుని… మిగతా రూ.3 లక్షలు తమ కూతురు పోషణకు, భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని.. హసీన్ జహాన్ కోల్‌కతా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే… హసీన్ జహాన్ ప్రొఫెషనల్‌ ఫ్యాషన్‌ మోడల్‌ అని, ఆమెకు ఆదాయం బాగానే ఉంటుంది కాబట్టి ఇంత భారీ మొత్తంలో భరణం డిమాండ్‌ చేయడం అన్యాయమంటూ… షమి లాయర్ కోర్టు ముందు వాదించారు. అయితే, షమికి ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వస్తుందని, నెలకు రూ.10 లక్షల భరణం కోరడంలో తప్పులేదని… హసీన్ తరఫు లాయర్ వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు… షమీ, తన భార్య హసీన్ జహాన్‌కు ప్రతీ నెలా రూ.1.3 లక్షల భరణం చెల్లించాలని, అందులో ఆమె తన వ్యక్తిగత అవసరాల కోసం రూ.50 వేలు, తమ కుమార్తె అవసరాల కోసం రూ.80 వేలు​ వాడుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.


షమీ, హసీన్‌ జహాన్‌కు 2014లో పెళ్లైంది. వారికి ఒక పాప కూడా ఉంది. ఫ్యాషన్ మోడల్‌ అయిన హసీన్‌ దుస్తుల విషయంలో అనేక విమర్శలు వచ్చినా… షమి ఆమెకు మద్దతుగా నిలబడ్డాడు. అయితే తన భర్త స్త్రీ లోలుడు అని, అతని కుటుంబం తనను హింసిస్తోందని సంచలన ఆరోపణలు చేస్తూ… పాపను తీసుకుని షమి నుంచి దూరంగా వెళ్లిపోయింది… హసీన్. అప్పటి నుంచి భరణం కోసం ప్రయత్నిస్తూ ఉంది. కోర్టు తీర్పుతో ఎట్టకేలకు భరణం వచ్చినా… తాను అనుకున్న మొత్తం వచ్చి ఉంటే పాపతో పాటు తన జీవితం సాఫీగా సాగిపోయేదని హసీన్ వ్యాఖ్యానించింది. ఏదేమైనా భరణం ఇవ్వాలని ఆదేశించిన కోర్టుకు ధన్యవాదాలు అని చెప్పింది… హసీన్.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×