Big Stories

Landmines:- ల్యాండ్‌మైన్స్‌ను కనిపెట్టే కొత్త టెక్నాలజీ..

Landmines:- దేశ భద్రత కోసం.. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో వినియోగించడం కోసం ప్రతీ ప్రపంచ దేశంలో ఎంతోకొంత అన్వాయుధాల తయారీ జరుగుతూనే ఉంది. కొన్ని దేశాలు అయితే.. అవసరానికి మించిన అన్వాయుధాలను తయారు చేసి ముందు జాగ్రత్తతో ఉంటున్నాయి. అయితే ఒక్కొక్కసారి ఈ అన్వాయుధాలు తమ సొంత మనుషులనే చంపేస్తుంటాయి. అలాంటి వాటిలో ల్యాండ్‌మైన్ ఒకటి. అయితే వీటిని కనిపెట్టడం కోసం ఆస్ట్రేలియాలో ఒక కొత్త టెక్నాలజీ తయారయ్యింది.

- Advertisement -

ఇప్పటికే ఒక ప్రాంతంలో ల్యాండ్‌మైన్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఎన్నో రకాల పరికరాలు, టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటికంటే భిన్నంగా, మెరుగ్గా పనిచేసేలా ఒక కొత్త టెక్నాలజీని తయారు చేశామంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. మామూలుగా ప్రస్తుతం ల్యాండ్‌మైన్స్‌ను కనిపెట్టడం కోసం ఎక్కువగా మెటల్ డిటెక్టర్స్‌ను ఉపయోగిస్తుంటారు. వాటికంటే ఇది కాస్త చిన్నగా, ఉపయోగించడానికి సులభంగా ఉంటుందని వారు చెప్తున్నారు.

- Advertisement -

మ్యాగ్నటిక్ రెసోనెన్స్ టెక్నాలజీ ద్వారా ఈ ల్యాండ్‌మైన్ డిటెక్టర్ తయారు చేశామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి ల్యాండ్‌మైన్స్‌లో ఉపయోగించే మాలిక్యూల్స్‌ను సులువుగా డిటెక్ట్ చేయగలవని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మెటల్ డిటెక్టర్స్.. ల్యాండ్‌మైన్స్‌లో ఉండే మెటల్‌ను కనిపెట్టి సమాచారం అందిస్తాయి. అలా కాకుండా ఇది కాస్త భిన్నంగా పనిచేస్తూ మైన్ క్లియరెన్స్ టీమ్ సమయాన్ని వృధా చేయకుండా ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి టెక్నాలజీనే రేడియో వేవ్స్‌ను గుర్తించడంలో కూడా ఉపయోగిస్తారు.

ప్రస్తుతం ఈ ల్యాండ్‌మైన్స్‌ను కనిపెట్టడం కోసం తయారు చేసిన పరికరం.. ఒక మెడికల్ పరికరంతో పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఎమ్మారై అనేది ఆసుపత్రిలో ఎక్కువగా వినిపించే టెస్ట్. ఒక మనిషి పూర్తి శరీరం స్కాన్ చేయడానికి ఈ ఎమ్మారై ఉపయోగపడుతుంది. అలాగే శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్త ల్యాండ్‌మైన్ డిటెక్టర్ కూడా ఎమ్మారైలో ఉపయోగించే టెక్నాలజీతోనే తయారు చేశామన్నారు. అందులో ఉపయోగించే రేడియో వేవ్స్.. ఈ పరికరం తయారు చేయడానికి ఉపయోగపడ్డాయన్నారు.

ఆస్ట్రేలియా తయారు చేసిన ఈ కొత్త ల్యాండ్‌మైన్ డిటెక్టర్స్‌ను త్వరలోనే సౌత్ ఈస్ట్ ఏషియాకు పంపించాలని సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది వరకు ఇలాంటి ల్యాండ్‌మైన్స్ డిటెక్టర్ల తయారీ సంఖ్య పెంచాలని వారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం వారు పలు ప్రైవేట్ సంస్థలతో కూడా ఒప్పందాలకు సిద్ధమవుతున్నారు. ల్యాండ్‌మైన్స్ వల్ల ఏడాదికి ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా గణాంకాల ప్రకారం.. దాదాపు 100 మిలియన్ ల్యాండ్‌మైన్స్.. 60 దేశాల్లో విస్తరించి ఉన్నాయని, అవి ప్రతీ ఏడాది దాదాపు 6,500 మందిని ఆసుపత్రిపాలు చేస్తున్నాయని తెలుస్తోంది.

మాంసాన్ని స్టడీ చేసే కొత్త పద్ధతి.. క్వాలిటీ కోసం..

for more updates follow this link:-Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News