Big Stories

Mask Sells Tesla Shares : మళ్లీ టెస్లా షేర్లు అమ్మిన మస్క్

Mask Sells Tesla Shares : ట్విట్టర్ డీల్ పూర్తి చేసేందుకు టెస్లాలోని తన వాటా షేర్లను అమ్ముతూ వచ్చిన మస్క్… టేకోవర్ తర్వాత మరోసారి టెస్లా షేర్లను అమ్మేశాడు. 3.58 బిలియన్ డాలర్ల విలువైన 22 మిలియన్ల షేర్లను తాజాగా అమ్మేశాడు… మస్క్. అయితే… ఇప్పుడు షేర్లు ఎందుకు అమ్మాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం మస్క్ బయటపెట్టలేదు.

- Advertisement -

గత ఏడాది కాలంలో మస్క్ టెస్లాలో 40 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశాడు. అదే ట్విట్టర్ కొన్నాక అమ్మిన షేర్ల విలువ 23 బిలియన్ డాలర్లు. ఏప్రిల్‌లో 8.4 బిలియన్‌ డాలర్లు, ఆగస్టులో 6.9 బిలియన్ డాలర్లు, నవంబర్‌లో 3.4 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను అమ్మిన మస్క్… తాజాగా 3.58 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. అయినా ఇప్పటికీ టెస్లాలో 13.4 శాతం షేరుతో మస్కే అతిపెద్ద వాటాదారుగా ఉన్నాడు.

- Advertisement -

మస్క్ ట్విట్టర్ డీల్ పూర్తి చేశాక… టెస్లా షేర్లు 28 శాతం నష్టపోయాయి. తాజాగా 2.58 శాతం కుంగిన టెస్లా షేరు విలువ… 156 డాలర్లకు చేరింది. ఇది రెండేళ్ల కనిష్టస్థాయి. టెస్లా కంటే ట్విట్టర్‌పైనే మస్క్ ఎక్కువ దృష్టి పెడుతున్నందు వల్లే… కంపెనీ విలువ పడిపోతోందంటూ టెస్లా పెట్టుబడిదారులు గగ్గోలు పెడుతున్నారు. అటు వాటా అమ్మకం, ఇటు టెస్లా షేరు విలువ పతనంతో… మస్క్ సంపద కూడా భారీగా కరిగిపోతూ వస్తోంది. ఇప్పుడు తన సంపద 174 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో… ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి పరిమితమయ్యాడు… మస్క్.

మరోవైపు… ట్విట్టర్ ఆదాయం కూడా భారీగా పడిపోతోందని వివిధ అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే… ఈ ఏడాది నవంబర్‌లో ట్విట్టర్ ఆదాయం 85 శాతం పడిపోయింది. దీనికి కారణం ప్రకటనలు భారీగా తగ్గిపోవడమేనని చెబుతున్నారు. ట్విట్టర్ ఆదాయంలో 89 శాతం ప్రకటనలదే కావడం, అది మస్క్ చేతుల్లోకి వచ్చాక చాలా కంపెనీలు ప్రకటనలు ఉపసంహరించుకోవడం… సంస్థ ఆదాయం తగ్గిపోవడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అందుకే మస్క్ టెస్లా షేర్లను అమ్మేసుకుంటున్నాడని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News