BigTV English

Meta Technology: ఆటోమొబైల్ లవర్స్‌కు మెటా గుడ్ న్యూస్..

Meta Technology: ఆటోమొబైల్ లవర్స్‌కు మెటా గుడ్ న్యూస్..

Meta Technology: నిజ జీవితంలో చేయలేని పనులు, చూడలేని ప్రదేశాలను మెటావర్స్‌లో అనుభూతి చెందవచ్చు. ఇప్పటికే ఈ వర్చువల్ ప్రపంచం ఎంతోమంది యువతను ఆకట్టుకుంది. అందుకే ఈ రోజుల్లో వర్చువల్ గ్యాడ్జెట్స్‌కు క్రేజ్ కూడా పెరిగిపోయింది. అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, కార్లపై అనేక ఆసక్తి ఉన్నవారి కోసం మెటావర్స్ మేకర్స్ ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. అదే నోక్యాప్ మెటా. ఇది ఆటోమొబైల్ లవర్స్‌కు కొత్త అనుభూతిని ఇస్తుందని యాజమాన్యం అంటోంది.


మెటావర్స్ అందిస్తున్న అనుభూతిని నెక్స్‌ట్ లెవెల్‌కు తీసుకువెళ్లాలని యాజమాన్యం భావిస్తోంది. అందుకే యూజర్లకు నచ్చే కార్ల బ్రాండ్లను వర్చువల్‌ ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశాన్ని అందిస్తోంది. అంటే నోక్యాప్ మెటాలో యూజర్లు తమకు నచ్చిన డ్రీమ్ కార్‌ను సెలక్ట్ చేసుకొని, దాని డ్రైవింగ్ సీటులో కూర్చున్నట్టు అనుభూతి చెందవచ్చు. అంతే కాకుండా దానిని డ్రైవ్ చేసినట్టు కూడా ఫీల్ అవ్వవచ్చు. కారు లగ్జరీని కాసేపు వర్చువల్‌గా అనుభవించవచ్చు. కాసేపు తమ డ్రీమ్ కారుకు ఓనర్ అయిపోవచ్చు.

కేవలం తమకు నచ్చిన కారును ఎక్స్‌పీరియన్స్ చేయడం మాత్రమే కాకుండా వర్చువల్‌గా యూజర్లు.. షోరూమ్స్‌ను కూడా విజిట్ చేయవచ్చు. తమకు నచ్చిన కారు అనుభూతిని, ఆటోమొబైల్ రంగం గురించి వారు తెలుసుకోవాలనుకుంటున్న సమాచారాన్ని వర్చువల్‌గా అక్కడి వారితో చర్చించవచ్చు. అందుకే నోక్యాప్ మెటా టెక్నాలజీ కేవలం ఆటోమొబైల్ లవర్స్‌కు మాత్రమే కాకుండా ఆటోమొబైల్ సంస్థలకు కూడా మంచే చేస్తుంది. దీని ద్వారా సంస్థలు వారి బ్రాండ్‌ను ఎక్కువమందికి పరిచయం చేసే అవకాశం కల్పిస్తుంది.


లగ్జరీ కార్లను కొనాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు వారికి అడ్డుపడతాయి. అలాంటి వారికోసం నోక్యాప్ మెటా ఉపయోగపడుతుందని యాజమాన్యం అంటోంది. మారుతీలో తిరిగే వారికి కూడా బీఎమ్‌డబ్ల్యూ డ్రైవ్ చేయాలనే కోరిక ఉంటుంది. ఏ బ్రాండ్ వాల్యూ దానికి ఉన్నా లగ్జరీ కార్లను కొనాలి అనుకునే వారికి మాత్రం ఎక్కువశాతం అది కలలాగానే మిగిలిపోతుంది. అలా అవ్వనివ్వకుండా కాసేపైనా వారికి నచ్చిన కారులో తిరుగుతున్నామనే అనుభూతిని నోక్యాప్ మెటా అందిస్తుంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×