Big Stories

Cutting Board: కటింగ్ బోర్డ్స్‌తో ఆరోగ్యానికి ప్రమాదం..

Cutting Board : మనం రోజూవారి ఉపయోగించే ఏ వస్తువు వల్ల ఎలాంటి సమస్య ఎదురవుతుందో చెప్పలేని జెనరేషన్‌లో జీవిస్తున్నాం. తినే ఆహారం, పీల్చే గాలి.. ఇలా అన్ని ఏదో ఒక విధంగా మనిషికి హాని కలిగిస్తూనే ఉన్నాయి. అలాగే మన ఇంట్లో ఉండే ఎన్నో వస్తువుల వల్ల కూడా మనకు తెలియకుండానే హాని జరుగుతుంది. తాజాగా అలాంటి ఒక వస్తువు గురించి శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ముఖ్యంగా గృహిణిలు ఉపయోగించే ఈ వస్తువు ఇంత ప్రమాదానికి దారితీస్తుందని కూడా ఎవరూ ఊహించలేరు.

- Advertisement -

కటింగ్ బోర్డ్స్.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు.. ఇలా ఏవి కట్ చేసుకోవాలన్ని కటింగ్ బోర్డ్స్ కావాల్సిందే. ఇంట్లోనే కాదు.. రెస్టారెంట్లలో, హోటళ్లో కూడా ఈ బోర్డ్స్‌నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చెక్కతో తయారు చేసే ఈ బోర్డ్స్ వల్ల ప్రమాదం ఏముంటుంది అనుకుంటున్నారా..? రోజూ ఈ బోర్డ్స్‌పై ఏదో ఒకటి పెట్టి కట్ చేయడం వల్ల ప్రతీ సంవత్సరం వీటి నుండి ఎన్నో మిలియన్ల మైక్రోపార్టికల్స్ విడుదలవుతాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. కేవలం చెక్క మాత్రమే కాదు పాలిథిలిన్ బోర్డ్స్ నుండి కూడా ఈ పార్టికల్స్ విడుదలవుతాయని అన్నారు.

- Advertisement -

కటింగ్ బోర్డ్స్ నుండి బయటపడే ఈ పార్టికల్స్.. మనుషులకు ప్రమాదకరమా కాదా అనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఇప్పటికీ దీని వల్ల ప్రత్యేకంగా జరిగే ప్రమాదం ఏంటని వారు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ ఏదో ఒక విధంగా ఆ మైక్రోపార్టికల్స్‌ అనేవి మన ఆహారంలోకి చేరుతున్నాయని, దాని వల్ల ఏదో ఒక విధంగా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని వారు భావిస్తున్నారు. మామూలుగా పాలిథిలిన్ బోర్డ్స్, చెక్క బోర్డ్స్ వల్ల ఎలాంటి ప్రమాదాలు లేకపోయినా.. ప్లాస్టిక్స్ బోర్డ్ వల్ల ఏదో ఒక విధంగా ప్రమాదం ఉంటుందని వారు అనుకుంటున్నారు.

ప్లాస్టిక్ బోర్డ్స్‌పై కూరగాయలు లాంటివి కట్ చేసినప్పుడు వాటి నుండి మైక్రోపార్టికల్స్ విడుదల అవుతాయి కాబట్టి అవి మన ఆహారంలోకి వెళ్లినప్పుడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే ప్లాస్టిక్ బోర్డ్స్ అనేవి ఎక్కువశాతం ఉపయోగించకపోవడం మంచిదని వారు సలహా ఇస్తున్నారు. ఇప్పటికే మనుషులు ఉపయోగిస్తున్న రోజూవారి వస్తువుల్లో మైక్రోప్లాస్టిక్స్ అనేవి ఎక్కువశాతం చేరుకొని వారి ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తున్నాయని గుర్తుచేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News