E-Paper
Advertisement

Magnetic Robots : కొత్త రకం రోబోలు.. చిన్న అయస్కాంతంతో కంట్రోల్..

Magnetic Robots : కొత్త రకం రోబోలు.. చిన్న అయస్కాంతంతో కంట్రోల్..
Advertisement
Magnetic Robots

Magnetic Robots : రోబోటిక్ రంగం అనేది గత కొన్నేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది. ఒకప్పుడు రోబోలు అంటే కేవలం సినిమాల్లో గ్రాఫిక్స్‌లో మాత్రమే ఉంటాయి అనే మాటను శాస్త్రవేత్తలు నిజం చేసి చూపించారు. అంతే కాకుండా వాటి తయారీని మెరుగుపరుస్తూ.. ఇప్పుడు ప్రతీ రంగంలో మనిషికి తోడుగా రోబోలు కూడా పనిచేసేలా తయారు చేశారు. తాజాగా రోబోల విషయంలో ఎమ్‌ఐటీ శాస్త్రవేత్తలు రూటు మార్చారు. రోబోలకు అయస్కాంత శక్తిని అందించారు.

Advertisement

మామూలుగా రోబోలను ఐరన్‌లాంటి మెటల్‌తో తయారు చేస్తారు. ఇక హ్యూమనాయిడ్ రోబోల విషయానికొస్తే.. రోబోలు కూడా మనుషుల్లాగా కనిపించడం కోసం వాటికి కృత్రిమ చర్మాన్ని అతికిస్తారు. అలాగే రోబోల విషయంలో శాస్త్రవేత్తలు తాజాగా కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఒక చిన్న అయస్కాంతంలో కూడా వీటిని కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు. మ్యగ్నటిక్ స్పైరల్స్‌తో వీటి తయారీ జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి ఇతర రోబోలలాగానే నడుస్తాయి, పాకుతాయి, ఈదుతాయని అంటున్నారు. దీంతో పాటు మ్యాగ్నటిక్ ఫీల్డ్‌కు కూడా స్పందిస్తాయని తెలిపారు.

ఒకే విధమైన మ్యాగ్నటిక్ ఫీల్డ్‌తో మూడు డైమెన్షన్స్ ఉన్న రోబోలను తయారు చేయడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అంతే కాకుండా వీటిని కంట్రోల్ చేయడం కోసం పెద్ద పెద్ద మ్యాగ్నటిక్ ఫీల్డ్స్ ఏమీ అవసరం లేదని, చిన్న మ్యాగ్నటిక్ ఫీల్డ్ అయినా చాలు అని చెప్తున్నారు. ఈ కొత్త రకమైన రోబోలు కార్గోను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడంలో సహాపడతాయన్నారు. అంతే కాకుండా ఈ రోబోల బాడీస్ రబ్బర్‌లాగా సాగుతాయి కాబట్టి గాజు వస్తువుల విషయంలో ఇవి మరింత జాగ్రత్త వహిస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఈ మ్యాగ్నటిక్ రోబోలు మిల్లీమీటర్ పొడవులో తయారు చేశామని, త్వరలో మరింత చిన్నగా కూడా తయారు చేస్తామని అన్నారు.

Advertisement

ఇదివరకు కూడా మ్యాగ్నటిక్ రోబోల తయారీ అనేది జరిగింది. అయితే వాటికి, వీటికి ఉన్న వ్యత్యాసాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పటివరకు ఉన్న మ్యాగ్నటిక్ రోబోలు కదలలాన్నా, ఏ యాక్టివిటీ చేయాలన్నా.. మ్యాగ్నెట్‌ను కదిలించాల్సిన అవసరం ఉండేది. కానీ తాజాగా తయారు చేసిన రోబోలు.. ఎక్కడ ఉన్న మ్యాగ్నటిక్ ఫీల్డ్‌తో అయిన కంట్రోల్ చేసే విధంగా ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఇంకా ఈ రోబోలపై పూర్తిస్థాయిలో టెస్టింగ్ జరగలేదని, త్వరలోనే ఇప్పుడు ఉన్న మ్యాగ్నటిక్ రోబోలతో వీటిని రీప్లేస్ చేస్తామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×