BigTV English

Musk clashes with Apple : ఆపిల్‌తోనూ పెట్టుకున్న మస్క్

Musk clashes with Apple : ఆపిల్‌తోనూ పెట్టుకున్న మస్క్

Musk clashes with Apple : ట్విట్టర్‌ను కొన్నాక అనేక వివాదాస్పద నిర్ణయాలతో అటు ఉద్యోగులు, ఇటు యూజర్లలో గందరగోళం నింపుతున్న ఎలాన్ మస్క్… ఇప్పుడు ఆపిల్‌ను గెలికాడు. ట్విట్టర్‌లో ఆపిల్‌ సంస్థ ప్రకటనలు నిలిపివేసిందని ట్వీట్ చేసిన మస్క్‌… యాప్‌ స్టోర్‌ నుంచి ట్విట్టర్‌ను తొలగిస్తామని కూడా ఆపిల్ బెదిరిస్తోందని ఆరోపించాడు. ఈ దాడి ట్విట్టర్ వరకే పరిమితమా? లేక తన మరో కంపెనీ అయిన టెస్లాపై కూడా కొనసాగుతుందా? అని ఆపిల్‌పై ఫైరయ్యాడు. అసలు ఏం జరుగుతోంది? అంటూ ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌నే ప్రశ్నించి… వరుస ట్వీట్లతో ఆపిల్‌ను ఓ రేంజ్ లో గెలికాడు… మస్క్.


నిజానికి ట్విట్టర్‌కు ప్రకటనల ద్వారా అత్యధిక ఆదాయం ఆపిల్‌ ద్వారానే వస్తోంది. ట్విట్టర్‌లో ప్రకటనల కోసం ఆపిల్‌ ఏటా ఏకంగా దాదాపు 100 మిలియన్‌ డాలర్లపైనే ఖర్చు చేస్తోంది. అంటే మన రూపాయల్లో 800 కోట్లకు పైమాటే. ట్విట్టర్ మనుగడకు ఆపిల్ ఇచ్చే ప్రకటనలు చాలా కీలకం. కొన్నేళ్లుగా ట్విట్టర్‌కు ప్రకటనలు ఇస్తూ వస్తున్న ఆపిల్… ఆ సంస్థతో సంప్రదింపులు, సంబంధాల నిర్వహణ కోసం ఏకంగా ఓ బృందాన్నే నియమించింది. అలాంటి ఆపిల్‌పై కయ్యానికి కాలు దువ్వి… మస్క్ పెద్ద సాహసమే చేశాడని నిపుణులు అంటున్నారు.

ట్విట్టర్ మస్క్‌ చేతుల్లోకి వచ్చాక ఆ కంపెనీలో రిస్క్ ప్రారంభమైందని, కానీ ఆపిల్‌ అలాంటి రిస్క్ చేయడానికి సిద్ధంగా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్‌ యూజర్లకు ఆపిల్‌ కూడా ఒక ప్రధాన గేట్‌వే అని… ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా దాదాపు 150 కోట్ల ఆపిల్ గ్యాడ్జెట్లలో ట్విట్టర్‌ను వాడుతున్నారని చెబుతున్నారు. ఒకవేళ ఆపిల్ తమ యాప్ స్టోర్‌ నుంచి ట్విట్టర్‌ను తొలగించాలని నిర్ణయిస్తే… అవన్నీ ఆ యాప్‌కు దూరమై, చివరికి యూజర్లు ఆపిల్ గ్యాడ్జెట్లకు కూడా దూరం కావాల్సి వస్తుందని చెబుతున్నారు. అసలే ఆర్థిక మాంద్యం భయాలు ముసిరిన వేళ… ఆపిల్ ట్విట్టర్‌తో వివాదాన్ని తెగేదాకా లాగకపోవచ్చని చెబుతున్నారు.


Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×