E-Paper
Advertisement

Musk’s ‘Giga Lab’ : మస్క్ ‘గిగా ల్యాబ్’.. 45 సెకండ్లలో కారు తయారీ..

Musk’s ‘Giga Lab’ : మస్క్ ‘గిగా ల్యాబ్’.. 45 సెకండ్లలో కారు తయారీ..
Advertisement
Musk's 'Giga Lab'

Musk’s ‘Giga Lab’ : టెస్లా అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే ఒక సంచలనాన్ని సృష్టించింది. డ్రైవర్లు లేకుండా కార్లు నడపవచ్చు అని ఎందరో చెప్పడం దగ్గర ఆగిపోతే.. టెస్లా దానిని నిజం చేసి చూపించింది. ఈ కంపెనీ ప్రారంభమయినప్పటి నుండి ఇప్పటివరకు టెస్లా క్రేజ్ అస్సలు తగ్గలేదు. అందుకే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరికొన్ని ప్రయోగాలు చేయాలని ఎలన్ మస్క్ భావిస్తున్నాడు. అందులో మొదటి అడుగే చైనాలో స్థాపించిన ‘గిగా ల్యాబురేటరీ’.

Advertisement

చైనాలోని చెంగ్డూలో టెస్లా.. గిగా ల్యాబురేటరీని స్థాపించింది. గిగా ల్యాబ్ అనేది కేవలం 45 సెకండ్లలోనే ఒక కారును తయారు చేస్తుందని యాజమాన్యం అంటోంది. ఫ్లూయల్‌తో పనిచేసే కార్ల పద్ధతిని పూర్తిగా మార్చాలని టెస్లా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. టెస్లా కంపెనీ ప్రారంభం అయినప్పటి నుండి చైనా.. ఆ కంపెనీకి అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. గిగా ల్యాబ్స్ ప్రారంభించాలి అనుకున్నప్పుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్.. 2 రోజులు పాటు చైనాకు వెళ్లి అక్కడి సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.

గిగా ల్యాబ్ చూడడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉండే పెద్ద భవనం లాగా అనిపిస్తుంది. చైనా మార్కెట్లోకి ప్రవేశించడానికి ఈ మాత్రం గ్రాండ్‌గా ఉండాలని ఎలన్ మస్క్ అనుకున్నాడేమో అని నిపుణులు భావిస్తున్నారు. ఈ ల్యాబ్‌లో అన్ని రకాల ఆటోమొబైల్స్, ప్రొడక్షన్‌కు సంబంధించిన వస్తువులు, రోబోలు, ఎలక్ట్రిక్ వెహికిల్ పార్ట్స్.. ఇలా అన్ని ప్రదర్శనకు ఉన్నాయి. దీంతో పాటు మరెన్నో సౌకర్యాలు కూడా ఈ ల్యాబ్‌లో ఉన్నాయని యాజమాన్యం చెప్తోంది.

Advertisement

అమెరికాలో టెస్లా మార్కెట్‌కు ధీటుగా చైనాను కూడా తన మార్కెట్‌గా మార్చుకోవాలని ఎలన్ మాస్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మస్క్.. రెండు రోజులు చైనా వెళ్లి అక్కడ షాంగాయ్‌లోని ఉద్యోగులను, ఉన్నతాధికారులను కలిసి ఏం మాట్లాడారన్న ఆసక్తి అందరిలో ఉంది. షాంగాయ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఎలన్ మస్క్‌ను చైనా ప్రభుత్వం కోరింది. 2019లోనే ప్రారంభమయిన షాంగాయ్ టెస్లా ప్లాంట్.. కొంతకాలంలో అద్భుతమైన రిజల్ట్‌ను చూపించిందని మస్క్ సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×