BigTV English
Advertisement

Nanosatellites :ఆస్ట్రేలియా భవిష్యత్తును మార్చనున్న నానోశాటిలైట్స్..

Nanosatellites :ఆస్ట్రేలియా భవిష్యత్తును మార్చనున్న నానోశాటిలైట్స్..

1950ల్లో ముందుగా శాటిలైట్స్ అనేవి అంతరిక్షంలోకి ఎగిరాయి. ఆ తర్వాత వాటి తయారీలో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. ఎలాగైతే ఫోన్లు కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తూ వస్తాయో.. అలాగే శాటిలైట్లు కూడా టెక్నాలజీకి తగినట్టుగా మారుతూ వచ్చాయి. మునుపటి కంటే ఇప్పుడు శాటిలైట్ల తయారీ మరింత సులభంగా మారింది. ఇక శాటిలైట్ల విషయంలో ఇటీవల సంచలనం సృష్టించిన మరో డిజైన్.. ‘నానోశాటిలైట్స్.’


నానోశాటిలైట్స్‌ను ముందుగా ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇప్పటికీ వాటిలో ఎన్నో మార్పులు చేస్తూ మెరుగుపరచడానికి వారు ప్రయత్నిస్తున్నారు. స్పేస్ ఇండస్ట్రీ రెస్పాన్సివ్ ఇంటలిజెంట్ థెర్మల్ (స్పిరిట్)లో ఈ నానోశాటిలైట్స్‌ను పూర్తిగా వినియోగించాలని వారు సన్నాహాలు చేస్తున్నారు. స్పిరిట్ అనేది ఒక క్యూబ్ శాటిలైట్. ఇది కూడా నానోశాటిలైట్‌లో ఒక రకం. 10 సెంటిమీటర్ల క్యూబ్ యూనిట్స్‌తో ఈ క్యూబ్‌శాట్‌ను తయారు చేశారు. ఇలాంటి ఆరు క్యూబ్‌లను జతచేరిస్తే స్పిరిట్ అవుతుంది.

స్పిరిట్ అనేది ఒక షూబాక్స్ ఆకారంలో ఉండి కేవలం 11.5 కేజీల బరువు ఉంటుంది. ఈ చిన్న పరికరం త్వరలోనే ఆస్ట్రేలియన్ టెక్నాలజీని శాసించనుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. త్వరలోనే ఆకాశంలోకి ఎగరనున్న ఈ స్పిరిట్‌లో కెమెరాలు, ఆంటీనా, ఏఐ కంప్యూటర్స్‌తో పాటు సూచనలు అందించే సిస్టమ్‌ కూడా అమర్చి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా స్పిరిట్‌లో చాలావరకు ఫీచర్స్.. ఇప్పటివరకు ఏ శాటిలైట్‌లో లేవని వారు తెలిపారు.


స్పిరిట్ అనేది తక్కువ బరువుతో ఎక్కువ సాధించే శాటిలైట్‌గా రూపొందించబడిందని శాస్త్రవేత్తలు గర్వపడుతున్నారు. అందులో శాటిలైట్ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి థెర్మల్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయబడిందని వారు తెలిపారు. ఇప్పటివరకు పదిరెట్ల ఎక్కువ బరువు ఉన్న శాటిలైట్లు చేయలేని పనులను స్పిరిట్ చేసి చూపిస్తుందని వారు నమ్మకంగా చెప్తున్నారు. స్పిరిట్ సక్సెస్.. ఇతర నానోశాటిలైట్ల తయారీకి కూడా కొత్త ఊపును అందిస్తుందన్నారు.

2023 చివర్లో స్పిరిట్ లాంచ్ జరగనుంది. లో ఎర్త్ ఆర్బిట్‌లోనే రెండేళ్లపాటు స్పిరిట్ పనిచేయనుంది. ఇది ఆస్ట్రేలియన్ టెక్నాలజీని మరింత ముందుగా తీసుకెళ్లడానికి ఉపయోగపడనుంది. అంతే కాకుండా ఆస్ట్రేలియా ఇండస్ట్రీని కమర్షియల్ చేయడానికి కూడా స్పిరిట్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ద్వారా ఆర్&డీ పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు. స్పిరిట్ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేయడానికి ఎన్నో విశ్వవిద్యాలయాలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంకానున్నాయి.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×