Big Stories

Nasa : యూఎఫ్ఓల అధ్యయనానికి నాసా కొత్త టీం.

Nasa : ఏలియన్స్… ఈ పేరు వినగానే వింత జీవులు కళ్లముందు మెదలాడతాయి. మనుషులు గాల్లో ఎగరడానికి ఎలాగైతే విమానాలను ఉపయోగిస్తారో… ఏలియన్స్ విమానాలను పోలిన వాహనాలను వాడుతాయనే నమ్మకం ఉంది. అయితే అవి సాసర్ ఆకారంలో చాలా వింతగా ఉంటాయి. అందుకే వాటిని ఫ్లయింగ్ సాసర్స్ అంటే ఎగిరే సాసర్లు అనిగానీ
అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ -యూఎఫ్ఓలు అనిగాని పిలుస్తారు. వీటిని హాలీవుడ్ సినిమాల్లో చూడొచ్చు. ఆ మధ్య నిజమైన ఫ్లయింగ్ సాసర్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అంతెందుకు అమెరికా సైనిక స్థావరాల వద్ద కనిపించాయంటూ కూడా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు వీటి ప్రస్తావన ఎందుకంటే… గాల్లో తిరిగే గుర్తుతెలియని సాధనాల అంతు చూడడానికి నాసా నడుం బిగించింది. అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమెనా-యూఏపీపై అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 16 మంది నిపుణులను ఎంపిక చేసినట్లు నాసా ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 24నే ఆ టీం పనికూడా మొదలు పెట్టినట్లు వెల్లడించింది. ఈ టీం తొమ్మిది నెలలపాటు పరిశోధన చేసి నివేదిక సమర్పించనుంది. రకరకాల సోర్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని, డేటాను విశ్లేషించి రిపోర్టు తయారు చేయనుంది. ఈ నివేదిక భవిష్యత్తులో కీలకంగా మారనున్నట్లు నాసా భావిస్తోంది.
ఆకాశంలో అసలు ఏం జరుగుతోంది? విమానాలు, రాకెట్లు వంటివి కాకుండా ఏలియన్స్ కు సంబంధించిన వాహనాలు, వాటి ఆనవాళ్లు ఏమైనా కనిపిస్తున్నాయా అనే కోణంలో ఈ అధ్యయనం సాగనుందని సైన్స్ మిషన్ డైరెక్టరేట్ విభాగానికి చెందిన అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థొమస్ జోబుకన్ తెలిపారు. అయితే ఇది ఏలియన్స్ పై పూర్తిస్థాయి అధ్యయనం మాత్రం కాదు. అసలు ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? లేవా అనేది తేల్చడం కూడా ఈ టీం పనికాదు. ఆకాశంలో గుర్తుతెలియని వాహనాలపై అధ్యయనం చేయడం వల్ల విమాన ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
-సాయికళ

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News