BigTV English

Netflix:పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు..! నెట్‌ఫ్లిక్స్ రూల్..

Netflix:పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు..! నెట్‌ఫ్లిక్స్ రూల్..

Netflix:ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది నెట్‌ఫ్లిక్స్. ఎన్నో అంతర్జాతీయ భాషల సినిమాలను స్ట్రీమ్ చేయడం వల్ల కూడా నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్లు పెరిగి పాపులారిటీ కూడా విపరీతంగా పెరిగింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్.. తన పాస్‌వర్డ్‌ను ఇతరులకు షేర్ చేయవద్దు అనే రూల్‌ను ప్రవేశపెట్టింది. కానీ అలా షేర్ చేసినా.. నెట్‌ఫ్లిక్స్‌ ఎలా ట్రాక్ చేస్తుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


త్వరలోనే నెట్‌ఫ్లిక్స్.. లాగిన్ అయినవారి లొకేషన్‌ను యాక్సెస్ చేయనుంది. లాగిన్ ఐడి ఏ లొకేషన్ నుండి వస్తుందో వారు గమనించనున్నారు. దీన్ని బట్టి ఆ లొకేషన్‌లో అదే లాగిన్ మరొకరు ఉపయోగిస్తున్నారా లేదా తెలుసుకోవడం వారికి సులువుగా ఉంటుంది. ఒక లాగిన్‌కు ఎన్ని స్క్రీన్స్ ఉండాలి అనే విషయం నెట్‌ఫ్లిక్స్ క్షుణ్ణంగా పరీక్షించనుంది. అందుకే ఒక లాగిన్‌లో వేర్వేరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్నవారు అవి ఉపయోగించుకోవచ్చు.

ఎప్పటికీ కనెక్ట్ చేసుండే వైఫై నెట్‌వర్క్‌ను నెట్‌ఫ్లిక్స్ ట్రస్టెడ్‌గా గుర్తిస్తుంది. అది కాకుండా వేరే వైఫైతో నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఆథెంటికేషన్ అడుగుతుంది. అంటే వేరే డివైస్‌లో నెట్‌ఫ్లిక్స్‌‌ను యాక్సెస్ చేయాలనుకునే ప్రతీసారి హోమ్ డివైస్‌ యాక్సెప్ట్ చేయాలని రూల్ కూడా ప్రవేశపెట్టనుంది.


నెట్‌ఫ్లిక్స్ ఉన్న ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌కు ఒక లింక్ పంపించి దాని నుండే ఇతర డివైస్‌లకు యాక్సెస్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీన్ని బట్టి వారి ప్రమయం లేకుండా వారి అకౌంట్‌ను ఉపయోగించాలి అనుకునే వారిని నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ హోల్డర్ అదుపు చేయగలరు. లింక్ మాత్రమే కాకుండా.. ఓటీపీ లాంటివి కూడా ప్రైమరీ అకౌంట్‌కు పంపించాలని ప్లాన్ చేస్తోంది.

ఇప్పటినుండి ప్రైమరీ అకౌంట్ హోల్డర్ అనుమతితోనే ఇతర డివైస్‌లలో వారి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ హ్యాండిల్ అంతా ప్రైమరీ అకౌంట్ హోల్డర్ చేతికి వెళ్లనుంది. ఇతర నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారుల లాగిన్ హ్యాక్ చేసి ఉపయోగించుకునే వారిని అదుపు చేయడానికి నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి కఠినమైన రూల్స్‌ను ప్రవేశపెట్టాలనుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. అంతే కాకుండా గతేడాది నెట్‌ఫ్లిక్స్ చాలా నష్టాల్లో ఉండడంతో ఇదంతా పర్మిషన్ లేకుండా ఇతర అకౌంట్లను యాక్సెస్ చేయడం వల్లే అని యాజమాన్యం గుర్తించింది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ఈ రూల్స్‌తో యూజర్స్ ముందుకు రానుంది.

Climate Changes:శాస్త్రవేత్తల పరిశోధనలకు భిన్నంగా కృత్రిమ మేధస్సు..

Sleeping Disorders:సరిపడా నిద్రకు అదే పరిష్కారం..!

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×