KTR on Hydra: మనం ఒకటి తలిస్తే.. ఇంకొకటి జరగడం ప్రతి ఒక్కరి లైఫ్ లో మనం చూస్తూ ఉంటాం. అయితే కొందరు చెప్పే మాటలు.. మళ్ళీ వారికే అస్త్రాలుగా మారి ఎదురుదాడికి దిగే సంధర్భాలు కూడా ఉంటాయి. అలా ఎక్కువగా పొలిటికల్ కామెంట్స్ చేసిన నేతలు.. ఈ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఓ కామెంట్ అలాగే ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.. కాంగ్రెస్ లీడర్స్. ఇంతకు అలా కేటీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్న కామెంట్స్ ఏవో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేత, వాటిని అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో గల అక్రమ కట్టడాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్వర్యంలో అధికారులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. అయితే హైడ్రాపై విమర్శలు సైతం వచ్చాయి.
ఓ వైపు ప్రభుత్వం మాత్రం.. చెరువులు ఆక్రమణలకు గురైతే.. వర్షాల సమయంలో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించినట్లు ప్రభుత్వం తన వాదన వినిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఓ వైపు ప్రతిపక్షంలో గల బీఆర్ఎస్ కూడా హైడ్రాను టార్గెట్ గా చేసుకొని ప్రభుత్వంపై విమర్శల పర్వాన్ని సాగిస్తోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకోవాలని సైతం లేఖలు కూడా రాశారు బీఆర్ఎస్ నేతలు. ఇదే విషయంపై అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం సాగుతోంది.
అయితే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అంతేకాదు హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలలో కానీ.. ఎక్కడైనా స్థలాలు, గృహాలు కొనుగోలు చేసేవారు.. ఆ స్థలాలు, గృహాలు చెరువుల ఆక్రమణలో ఉన్నాయో లేవో సరిచూసుకోవాలని, అలాగే అన్ని ధృవీకరణ పత్రాలు ధృవీకరించుకున్నాకే కొనుగోలు చేయాలని, అనవసరంగా ప్రజలు ఇబ్బందులు పడవద్దని హైడ్రా సూచించింది.
పనిమంతుడని పందిరేపిస్తే… పిల్లి తోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి… భయాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది.… pic.twitter.com/EwPkTPBOP1
— KTR (@KTRBRS) October 7, 2024
హైడ్రా ఇచ్చిన ఈ ప్రకటనతో రియల్ ఎస్టేట్ మోసాలు తగ్గుముఖం పట్టాయని ప్రజలు తెలుపుతున్నారు. దీనికి ప్రధాన కారణం అన్ని ధృవీకరణ పత్రాలు ఓకే అనుకున్న తరువాతనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాగుతోంది లేకుంటే కట్ అనేస్తున్నారు ప్రజలు. ఈ ఎఫెక్ట్ మాత్రం రిజిస్ట్రేషన్ ఖజానాపై పడిందని పలువురి అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా.. హైడ్రా హైరానాతో 2నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. ఆదాయం తగ్గిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
Also Read: Ferozkhan: కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి.. పోలీస్ అలర్ట్..
దీనికి కేటీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని కాంగ్రెస్ లీడర్స్ ట్వీట్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, స్థలాలు విక్రయించాలన్న లక్ష్యంతో, అమాయకులను మోసం చేసే వ్యక్తుల ఆటలు సాగకుండా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పక్కాగా సాగుతుంటే.. రిజిస్ట్రేషన్ ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని కేటీఆర్ అనడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్స్.
అంతేకాకుండా రిజిస్ట్రేషన్ లకు ముందుకు రాకపోవడానికి లక్ష కారణాలు ఉండవచ్చని, అందుకు హైడ్రాను బూచిగా చూపడం కేటీఆర్ లాంటి లీడర్ కు తగదంటున్నారు. ప్రజలు చైతన్యమై అన్ని ధృవీకరణాలు కరెక్ట్ అనుకుంటేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందడుగు వేస్తున్నారని లేకుంటే లక్షల రూపాయలు ఇచ్చి మోసపోతామన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారని సోషల్ మీడియా వేదికగా.. కాంగ్రెస్ తెలుపుతోంది.
ఏదిఏమైనా జస్ట్ ఆస్కింగ్ కేటీఆర్ సార్.. ప్రజలు మోసపోకుండా జాగ్రత్త పడడం ముఖ్యమా.. లేకుంటే అక్రమ స్థలాలు, గృహాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని మోసపోవడం ముఖ్యమా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.