BigTV English

New update in Google Meet : గూగుల్ మీట్‌లో కొత్త అప్డేట్.. ‘ఆన్ ది గో’..

New update in Google Meet : గూగుల్ మీట్‌లో కొత్త అప్డేట్.. ‘ఆన్ ది గో’..


New update in Google Meet : గూగుల్ అనేది ఇప్పటికే యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువగా అప్డేట్స్, ఫీచర్లపై గూగుల్ ఎక్కువగా దృష్టిపెడుతుందని తెలుస్తోంది. సెర్చ్ ఇంజెన్ల విషయంలో పెరుగుతున్న పోటీ కూడా గూగుల్ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ ఆధ్వర్యంలో పలు సర్వీసులు ఉండగా.. తాజాగా మీట్ విషయంలో మరో కొత్త అప్డేట్‌లో ఈ సంస్థ ముందుకొచ్చింది.

గూగుల్ మీట్ అనేది ప్రస్తుతం యూజర్లు ఇష్టపడే వీడియో కాల్స్ సర్వీసులలో ఒకటి. ముఖ్యంగా ప్రొఫెషనల్ విషయాల్లో గూగుల్ మీట్ అనేది సంస్థలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సాఫ్ట్‌వేర్ సంస్థలు గూగుల్ మీట్‌పై ఎక్కువగా ఆధారపడుతుండడంతో అందులో కూడా కొన్ని అప్డేట్స్‌ను ప్రవేశపెట్టాలని యాజమాన్యం అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ అప్డేట్ పేరే ‘ఆన్ ది గో’. గూగుల్ మీట్‌ను ఉపయోగిస్తున్న వారు ప్రతీసారి ఒకే చోట కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేని విధంగా ఈ అప్డేట్ సౌలభ్యాన్ని అందిస్తోంది.


ముఖ్యంగా యూజర్లు వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా వీడియో కాల్ మాట్లాడుతూ ఉండడం కోసమే గూగుల్ మీట్.. ఆన్ ది గో అనే అప్డేట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికీ ఈ అప్డేట్ అనేది ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోని ఉంది. కానీ త్వరలోనే దీని విడుదలకు గూగుల్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఫోన్‌లో ఉన్న మోషన్ సెన్సార్స్ సాయంతో గూగుల్ మీట్‌ను ఉపయోగిస్తున్న సమయంలో యూజర్లు.. వాకింగ్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కనిపెడుతుంది. దీంతో వెంటనే దానంతట అదే ట్రావెల్ ఫ్రెండ్లీ మోడ్‌కు యాక్టివేట్ అవుతుంది.

గూగుల్ మీట్ ఉపయోగిస్తున్న వారు తామంతట తాముగా కూడా ‘ఆన్ ది గో’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికే తాజాగా గూగుల్ మీట్ అనేది ఎవ్రీవన్ ఈజ్ ఏ వ్యూయర్ అనే అప్డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక త్వరలోనే వీడియో కాల్స్ విషయంలో క్లారిటీని కూడా పెంచాలని గూగుల్ మీట్ సన్నాహాలు చేస్తోందట. వీడియో కాల్స్ సర్వీసులకు సంబంధించిన యాప్స్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి గూగుల్ మీట్ అనేది తనవంతు ప్రయత్నం చేస్తుందని నిపుణులు అనుకుంటున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×